- Advertisement -
బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రెస్ మీట్‌లో చేదు అనుభవం ఎదురయ్యింది. ఢిల్లీలోని భాజాపా కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్న జీవీఎల్‌పై ఓ వ్యక్తి షూతో దాడి చేశాడు. వెంటనే షూతో దాడి చేసిన వ్యక్తిని కార్యాలయ సిబ్బంది పట్టుకుని బయటక పంపారు .ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఓ విలేఖరి అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకన్నా పోలీసులు ..షూ విసిరిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శక్తి భార్గవ్‌గా గుర్తించారు.
అయితే, అతను ఎందుకు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. శక్తిభార్గవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శక్తి భార్గవ్ ఓ పాత్రికేయుడని, నరేంద్ర మోదీపై అసంతృప్తితోనే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు .