Saturday, May 11, 2024
- Advertisement -

ఫలించిన హరీష్ రావు వ్యూహం

- Advertisement -

సిద్ధిపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ 32 వార్డుల్లో 22 వార్డులు టిఆర్ఎస్ గెలుచుకోగా కాంగ్రెస్, బిజెపిలు చెరో రెండు వార్డుల్లోనూ గెలిచాయి. మజ్లిస్ ఒక వార్డును కైవసం చేసుకుంది.

ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక్క స్ధానం కూడా దక్కకపోవడం విశేషం. సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర మంత్రి టి.హరీష్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు. దీంతో ఇక్కడ టిఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే అయ్యింది.

ఇక్కడ ఏడు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించగా వారిలో ఆరుగురు టిఆర్ఎస్ రెబెల్ అభ్యర్ధులుగా పోటీ చేసిన వారే. వీరంతా విజయం సాధించిన వెంటనే హరీష్ రావు సమక్షంలో తిరిగి సొంతగూటికి చేరిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -