- Advertisement -
కేంద్రం ఇచ్చిన ప్యాకేజ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకున్నారని అన్నారు బిజెపి నేత సోము వీర్రాజు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అర్థం చేసుకోవాలని అన్నారు. సోము వీర్రాజు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కాకినాడ, తిరుపతి బహిరంగ సభలలో బిజెపి పై చేసిన విమర్శలు చేసినా.. ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ గా మారింది కావున ఆ విమర్శలను అర్థం చేసుకున్నామని అన్నారు. పవన్ కూడా కేంద్రం ఇచ్చిన ప్యాకేజ్ ని అర్థం చేసుకోవాలని కోరారు.
ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నిస్తామని అన్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజ్ ని వివరిస్తూ ప్రజల్లోకి వెళతామని అన్నారు.ఈ నెల 22 న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాజమండ్రిలో పర్యటించనున్నారని తెలిపారు.
Related