Monday, May 5, 2025
- Advertisement -

నరాలు తెగే ఉత్కంఠ..పాక్‌కు ఓటమి తప్పలేదు

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి నరాలు తెగే ఉత్కంఠ మధ్య దక్షిణాఫ్రికా – పాకిస్థాన్ మధ్య జరిగింది. పాక్ విధించిన 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఒక వికెట్ తేడాతో గెలుపొందింది.ఆరే మ్యాచ్‌ల్లో ఐదో విజయంతో సఫారీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి సెమీస్‌కు ఒక అడుగు దూరంలో నిలిచింది.

దక్షిణాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ (91) పరుగులతో రాణించగా బావుమా 28,డికాక్ 24,వాన్ డెర్ డుస్సేన్ 21,మిల్లర్ 29,జాన్‌సెన్ 20 పరుగులు చేశారు. షాహీన్‌ 3/45, ఉసామా 2/45 రెండు వికెట్లు తీశారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచి పాక్ సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసింది.

ఇక అంతకముందు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. కె బాబర్‌ ఆజమ్‌ (50), సౌద్‌ షకీల్‌ (52) హాఫ్ సెంచరీలతో రాణించగా షాదాబ్‌ ఖాన్‌ (43),మహమ్మద్‌ రిజ్వాన్‌ (31) పరుగులు చేశారు. ఈ ఓటమితో పాకిస్థాన్‌ సెమీఫైనల్‌ దారులు దాదాపుగా మూసుకుపోగా.. షంసీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -