Wednesday, May 15, 2024
- Advertisement -

ఎన్నికల్లో 11 కోట్లు ఖర్చు పెట్టా…!

- Advertisement -

ఒక్కొక్కాసరి నోరు జారడం ఎంత ప్రమాదకరం అనేది తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టాదు. రాజకీయనాయకులు గా పెద్ద పొజిషన్ లో ఉన్నప్పుడు పొరపాటున కూడా నోరు జారే ప్రయత్నం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు కోడెల శివప్రసాద్ ని అడిగితే చెప్తారు.

టీవీ ఇంటర్వ్యూ లో ఆయన చేసిన ఒక సీక్రెట్ పని ని చెప్పేసి బుక్ అయిపోయారు ఆయన. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే గా పోటీ చేసిన అభ్యర్ధి ఖర్చు ఒక్క ఎన్నిక కి ఇరవై ఎనిమిది లక్షలకి మించకూడదు అనేది నిబంధన. అంతకంటే తక్కువే తాను ఖర్చు పెట్టినట్టు కోడెల ఎన్నికల కమీషన్ కి రాసిచ్చిన అఫిడవిట్ లో మేన్షన్ చేసారు. అయితే తాజాగా సాక్షి దిన పత్రిక కి ఇంచ్చిన ఇంటర్వ్యూ లో తాను 11 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అని ఓపెన్ అయిపోయి నాలిక కరుచుకున్నారు ఆయన. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు కొన్ని వందల రెట్లు ఖర్చు ఎక్కువగా ఉండటం ఒకటైతే.. ఎన్నికల్లో కోడెల సమర్పించిన అపిడవిట్ ప్రాకారం ఆయన స్థిరచరాస్తులు కలిపి రూ.5.3కోట్లుగా చూపించారు.

అంత సొమ్ము ఆస్తి ఉన్న వ్యక్తి 11 కోట్లు ఎలా ఖర్చు పెడతారు అనేది ఆశ్చర్య కరం. సాక్షి ఛానల్ అసలే ప్రభుత్వానికి బద్ధ వ్యతిరేకి ఈ టైం లో ఆ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ .. “1983లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రూ.30 వేలు ఖర్చు అయ్యిందని.. అందులో కూడా గ్రామాల నుంచి.. వివిధ వర్గాల నుంచి చందాల రూపంలో వచ్చాయని చెప్పిన కోడెల..మొన్నటి ఎన్నికల్లో మాత్రం రూ.11.5కోట్లు ఖర్చు” అయినట్లుగా చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -