Sunday, May 5, 2024
- Advertisement -

నిజం చెప్పిన మోత్కుప‌ల్లిని పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌..

- Advertisement -

తెలంగాణా టీడీపీ సీనియ‌ర్‌నేత మోత్కుక‌ప‌ల్లి న‌ర‌శింహులు పార్టీ అధినేత చంద్ర‌బాబుపై ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా బాబును దుమ్ముదులిపారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడిపైనే కుట్రలుపన్నిన నీచుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్‌ దగ్గర్నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించాడు. మా నాయకుడి మరణానికి కారకుడు కూడా నటచక్రవర్తి చంద్రబాబేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అలా మాట్లాడిన వెంట‌నే మోత్కుప‌ల్లిని పార్టీనుంచి బ‌హిష్క‌రించారు. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఓ ప్రకటన చేశారు. మోత్కుపల్లి విపరీత ధోరణితో పార్టీపై విమర్శలు చేశారని, ఆయన వ్యవహారం తార స్థాయికి చేరిందని, పార్టీని బలహీనపరిచే విధంగా ఆయన మాట్లాడారని మండిపడ్డారు.

తనకు గవర్నర్ పదవి రాలేదన్న అక్కసుతోనే రమణ విమర్శలు చేశారని అన్నారు. మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇవ్వాలని నాడు కేంద్రాన్ని చంద్రబాబు కోరారని, అందుకు కేంద్రం కూడా అంగీకరించిందని చెప్పారు. అయితే, తమిళనాడు గవర్నర్ గా తనను నియమించాలని మోత్కుపల్లి కోరారని, అందుకు కేంద్రం అంగీకరించలేదని రమణ చెప్పారు. నిజాలు చెబితే బ‌హ‌ష్క‌ర‌నేనా…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -