Monday, May 20, 2024
- Advertisement -

కామాంధుడికి చెక్ పెట్టిన పోలీసులు

- Advertisement -

ప్ర‌పంచంలో ఎంతో మంది కామాంధుల‌ను చూసింటాం …కాని ఇలాంటి కామాందున్ని బ‌హూశ చూసిండం. తనను తాను ‘సుల్తాన్‌ ఆఫ్‌ సెక్స్‌’ గా అభివర్ణించుకుంటూ 150 మందికిపైగా మహిళల జీవితాలతో ఆటలాడుకుకున్న నీచుడి ఆట క‌ట్టించారు బంగ్లాదేశీ పోలీసులు. ఇంత మంది అమ్మాయిల‌ను ఎలా ట్రాప్ చేశాడో తెలుసుకుంటె విస్తుపోయొనిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

గడిచిన కొద్ది నెలలుగా సూపర్‌ హీరోల మాస్క్‌లు ధరించిన ఒకడు.. ఇంటర్నెట్‌లో అసభ్య వీడియోలను పోస్ట్‌ చేస్తున్నాడు. తనను తాను సెక్స్‌ సుల్తాన్‌గా అభివర్ణించుకునే వాడి అసలు పేరు ఫౌద్‌ బిన్‌ సుల్తాన్‌. చేసేది రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారం. జుగుప్సాకరమైన వీడి వీడియోల​కు యువత, చిన్నపిల్లు బాగా ఎట్రాక్ట్‌ కావడంతో బంగ్లాదేశ్‌ అంతటా సుల్తాన్‌ పేరు మారుమోగిపోయింది.

కొందరు వివాహిత మహిళలను లోబర్చుకున్న సుల్తాన్‌.. వారి వీడియోలను చిత్రీకరించి, బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బులు గుంజేవాడు. 150 మందికిపైగా మహిళలు వీడి వలలో చిక్కుకుని తీవ్ర స‌మ‌స్య‌ల‌లో చిక్కునున్నారు. గురువారం వాడి ఇంటిపై దాడి చేసిన పోలీసులు పెద్ద ఎత్తున పోర్నోగ్రాఫిక్‌ వీడియోలు, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోర్నోగ్రఫీ నిషేధం కొనసాగుతున్న బంగ్లాదేశ్‌లో సుల్తాన్‌ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు చాకచక్యంగా వలపన్ని నిందితుడిని పట్టుకున్నారు. మత్తు పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. యాంటీ పోర్నోగ్రఫీ చట్టం కింద సుల్తాన్‌ను అరెస్ట్‌ చేశామని, నేరం నిరూపణ అయితే అతనికి 10 జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -