Saturday, May 18, 2024
- Advertisement -

రాఖీని ఆ రోజు ఏ టైంలోపు కట్టాలో తెలుసా..?

- Advertisement -

రాఖీ పండుగ.. అక్కా త‌మ్ముళ్ల, అన్నా చెల్లెల్లు అనుబంధంకు ప్రతీక. రాఖీ పండుగ రోజు.. అక్కా చెల్లెల్లు తమ.. అన్నదమ్ముళ్లకు రాఖీలు కడతారు. తమకు తమ సోదరులు ఎప్పుడు రక్షణగా నిలవాలని వారు కోరుకుంటూ తీపి తినిపించుకుంటారు.

అయితే ఈ సారి ఆగ‌స్టు 7న రాఖీ పండుగ వ‌స్తోంది. అదే రోజు నా పౌర్ణమి. కానీ ఆ రోజున ఉదయం 11 గంట‌ల లోపు రాఖీలు కట్టుకోవాలని పండితులు అంటున్నారు.ఆగ‌స్టు 7న చంద్ర‌గ్ర‌హ‌ణం వ‌స్తుందట‌. అయితే ఆ గ్ర‌హణం రాత్రి 10.47 గంట‌ల‌కు ప్రారంభ‌మై రాత్రి 12.48 గంట‌ల‌కు ముగుస్తుంద‌ట‌. కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం 1.47 లోపే భోజ‌నం ముగించుకోవాల‌ట‌. ఇక రాఖీల‌ను క‌ట్టేవారు ఉద‌యం 11 గంట‌ల్లోపే ఆ కార్య‌క్రమాన్ని ముగించ‌కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దేవాల‌యాల్లో ఉద‌యం 10.47 గంట‌ల్లోపే ధూప‌, దీప నైవేద్యాల‌ను పూర్తి చేయాలి.

ఆ రోజున ఎవ‌రైనా త‌ద్దినాలు పెట్టాల‌నుకుంటే మ‌ధ్యాహ్నం 12 గంట‌ల్లోపే ఆ తంతు ముగించాల‌ట‌. రాఖీ పండుగ రోజున య‌జ్ఞోప‌వీత ధార‌ణ చేసుకునే వారు సోమ‌, మంగ‌ళ వారాల్లో రెండు సార్లు య‌జ్ఞోప‌త‌వీత ధారణ చేసుకోవాల‌ని పండితులు చెబుతున్నారు. క‌నుక రాఖీ రోజున ముఖ్యంగా రాఖీలు క‌ట్టేవారు గుర్తుంది క‌దా, ఉద‌యం 11 గంట‌ల్లోపే కార్య‌క్ర‌మాన్ని ముగించాలి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -