Sunday, May 5, 2024
- Advertisement -

ప‌వ‌న్ మ‌ద్ద‌తుపై చ‌కోర ప‌క్షిలా ఎదురు చూస్తున్న చంద్ర‌బాబు…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌లో ప్ర‌చారంతోపాటు…పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం తార‌స్థాయికి చేరింది.అది ఎంతదాకంటె చెప్పుకోల‌ని మాట‌ల తూటాలు పేలుతున్నాయి.వైసీపీ మాంచి దూకుడుమీదుంటె..టీడీపీ మాత్రం జ‌న‌నేత మాట‌కోసం చకోర‌ప‌క్షిలా ఎదురుచూస్తోంది.మొన్న ఉప ఎన్నిక‌పై మ‌ద్ద‌తుపై బాబులో ఆశ‌లు క‌ల్పించారు.

నంద్యాల ఉప ఎన్నికకి సంబంధించి రెండు మూడు రోజుల్లో మాట్లాడతానని సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత ఇటీవలే వ్యాఖ్యానించారు.. ఇప్పుడు పవన్‌ స్పందన గురించి, తెలుగుదేశం పార్టీ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. పవన్‌ తమకే మద్దతిచ్చినట్లుగా భావించాల్సి వుంటుందనీ, ఎందుకంటే పవన్‌ తమకు మిత్రుడనీ, జనసేన తమకు మిత్రపక్షమని ఆల్రెడీ మంత్రి అఖిలప్రియ ప్రకటించేసుకున్నారు.

పవన్‌ మీడియా ముందుకు రాకపోయినా తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ జనసేనని తమ మిత్రపక్షంగా ప్రకటించేసుకున్న దరిమిలా.. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన నష్టం లేదు. ఎవరి మనస్సాక్షి ప్రకారం వారు ఓటేయాలని పవన్‌ పిలునిస్తే మాత్రం టీడీపీ శ్రేణుల ఆశలపై నీళ్ళు చల్లినట్లే అవుతుంది. కానీ, అంత సీన్‌ వుండకపోవచ్చు.

మీడియా ముందుకు రావాల్సిందిగా పవన్‌పై మంత్రి అఖిలప్రియ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగోతందన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. పవన్‌ వ్యవహార శైలి చంద్రబాబుకి తెలుసు గనుక, టైమ్‌ చూసి రంగంలోకి దించుతామని అఖిలప్రియకి సర్ది చెబుతున్నారట. నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకు తమవైపుకు తిరగాలంటే, పవన్‌ నుంచి సానుకూల ప్రకటన రావాల్సిందేనన్నది మంత్రి అఖిలప్రియ భావన. ఎంత‌మ‌టుకు ప‌వ‌న్ నిద్ర‌లేస్తాడో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -