Sunday, May 19, 2024
- Advertisement -

చంద్రబాబుకు దిమ్మతిరిగే దెబ్బ….. 6 నెలలకు మించి స్టే ఉండొద్దని సుప్రీం తీర్పు

- Advertisement -

సోనియాతో కుమ్మక్కై జగన్‌ని కేసుల్లో బుక్ చేయించి ఆనందించిన చంద్రబాబుకు ఇప్పుడు అదే మ్యూజిక్ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. అన్నింటికీ మించి పరిస్థితులన్నీ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగానే కనిపిస్తున్నాయి. అనుభవజ్ఙుడైన పాలకుడిని అని 2014లో ప్రజలను నమ్మించిన చంద్రబాబు నాలుగేళ్ళ పాలన తర్వాత ఆ నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఇక ఢిల్లీ స్థాయిలో తన బలాలన్నీ కూడా ఇప్పుడు బలహీనతలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు దిమ్మతిరిగే స్థాయి తీర్పు సుప్రీం కోర్టు నుంచి వచ్చింది.

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయాక కూడా ప్రతి సందర్భంలోనూ……నేను నిప్పు, నిప్పులా బ్రతికే చంద్రబాబు అవినీతి వ్యవహారాల్లో ఎన్ని కేసుల్లో స్టే తెచ్చుకుని మనుగడ సాగిస్తున్నాడన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సుప్రీం కోర్ట్ అలాంటి స్టే వ్యవహారాలపై షాకింగ్ తీర్పు ఇచ్చింది. అవినీతి కేసులలో ఆరు నెలలకుమించి స్టే ఇవ్వకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. చంద్రబాబుపైన ఉన్న స్టేలు అన్నీ కూడా ఆరు నెలల కాల పరిమితి దాటినవే. ఓటుకు కోట్లు కేసులో కూడా చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడని…….ఇప్పటి వరకూ చంద్రబాబుపైన ఉన్న కేసులకు సంబంధించిన స్టేలు అన్నీ ఎత్తేస్తే మాత్రం బాబు అడ్డంగా బుక్కయినట్టేనని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఆరు నెలలకు మించి స్టే ఇవ్వరాదు అని సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు మాత్రం చంద్రబాబుకు భారీ షాకేనని న్యాయశాస్త్ర పండితులు ఘంటాపథంగా చెప్తూ ఉండడం మాత్రం టిడిపి శ్రేణుల్లో ఆందోళన పెంచుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -