Monday, May 20, 2024
- Advertisement -

బాల్ ట్యాంప‌రింగ్‌పై సోషియ‌ల్‌మీడియాలో స్పందించిన షేన్ వార్న్‌…

- Advertisement -

బాల్ ట్యాంపరింగ్ వివాదం క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపేసింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని రీతిలో ఆ జట్టు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ వ్యవహరంతో సంబంధం ఉన్న ముగ్గురు ఆటగాళ్లపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ వేటు వేసింది. తాజాగా ఈ వివాదంపై ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తన సుదీర్ఘ కెరీర్‌లో ఇలాంటి సిగ్గుమాలిన సంఘటన ఎప్పుడూ చూడలేదని, క్షమించలేని తప్పును ఆసీస్‌ ఆటగాళ్లు చేసారని వార్న్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బాల్‌ ట్యాంపరింగ్‌ను చాలా మంది ఆటగాళ్లు ఆవేశపూరితంగా చేశారని, కానీ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక వస్తువు తెచ్చుకొని ట్యాంపరింగ్‌ చేయడం తానెప్పుడు చూడలేదన్నాడు. ఇది ఓ సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఈ చర్యతో దేశ పరువు తీయడమే కాకుండా ఆసీస్‌ అభిమానులకు అపత్రిష్ట తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

బాల్ ట్యాంపరింగ్‌ తో క్రికెట్ లో చీటింగ్ చేయడం ఇదే మొదటిసారి కాదని గుర్తు చేశాడు. ఈ వివాదంలో సఫారీ ప్రస్తుత కెప్టెన్ డు ప్లెసిస్ రెండుసార్లు, అదే జట్టు బౌలర్ ఫిలాండర్ ఒకసారి దొరికారని పేర్కొన్నాడు. ఈ వివాదంలో సచిన్ టెండూల్కర్, మైక్ అథెట్రాన్ వంటి దిగ్గజాలే ఉన్నారని పేర్కొన్నాడు. అలాంటప్పుడు ఆసీస్ ఆటగాళ్లు ఆందోళన చెందడం సరికాదని పేర్కొన్నాడు.

స్మిత్ తన దృష్టిలో అద్భుతమైన ఆటగాడు మాత్రమే కాదని, మంచి మనిషని తెలిపాడు. అయితే మ్యాచ్ లో చాలా తెలివితక్కువ పని చేశాడని మండిపడ్డాడు. స్మిత్, వార్నర్ కి విధించిన శిక్ష చాలా దారుణమైందని పేర్కొన్నాడు. ఏడాది నిషేదం చాలా పెద్ద శిక్ష అని పేర్కొన్నాడు. అసలు కేప్‌టౌన్‌లో ఏం చేశారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆటగాళ్లకు వార్న్‌ హితబోద చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -