Friday, May 2, 2025
- Advertisement -

రేప్ కేసు ఘటనలో ఆశ్చర్యకర నిజాలు

- Advertisement -

జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల విచారణ వేగంవంతమైంది. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో కీలక నిందితుని కోసం గాలిస్తున్నారు. మే 29న జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితులంతా రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందిన వారు కావటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విపక్షాల ఆందోళనతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోలీసుల విచారణలో తవ్వేకొద్దీ ఈ ఘటనకు సంబంధించిన ఆశ్చర్యం గొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారం అనంతరం నిందితులు మొయినాబాద్‌లోని ఓ రాజకీయ నేత ఫాంహౌజ్‌లో మద్యం సేవించినట్లు తెలుస్తోంది.

అనంతరం అక్కడ్నుంచి వేర్వేరు చోట్లకు పరారయ్యారు. ఆ ఫాం హౌజ్ వెనుకనే ఇన్నోవా కారును దాచిపెట్టిన నిందితులు.. ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు. కారుపై ఎమ్మెల్యే, ప్రభుత్వ స్టిక్కర్లు తొలగించారు.

Also Read

ఉద్యోగులపై సజ్జల కామెంట్స్

డీజీపీకి చంద్రబాబు ఘాటు లేఖ

మంత్రి కొప్పులు నా సీటు లాగేసుకున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -