జూబ్లిహిల్స్‌లో పేలుడు …వృద్ధుడికి తీవ్ర‌ గాయాలు..

- Advertisement -

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ వెంకటగిరిలో పేలుడు ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. వెంకటగిరిలోని ఆజాయ్ బార్ దగ్గర ఈ పేలుడు సంఘ‌ట‌న‌ జరిగింది. పేలుడులో మాణిక్‌రావు అనే వృద్ధుడికి తీవ్ర గాయాల‌య్యాయి. గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. సినిమా వాళ్లు ఏదైనా పేల్చారా? లేక ఇంకా ఏమైనా జరిగింఆ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్‌ కూడా ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. ఆధారాలను బట్టి డిటోనేటర్ పేలినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు .ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. పేలుడు పదార్థాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -