వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రముఖ నటి టబు తాజాగా మరో మాస్ అండ్ పవర్‌ఫుల్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాలీవుడ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘స్లమ్ డాగ్’. దీనికి ‘33 టెంపుల్ రోడ్’ (SLUMDOG – 33 Temple Road) అనే ఆసక్తికరమైన ఉపశీర్షికను ఖరారు చేశారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
ఈ సినిమాలో టబు చాలా పవర్‌ఫుల్ డిప్యూటీ కమిషనర్ (డీసీపీ) గౌరీ హెగ్డే పాత్రలో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా టబు పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రత్యేకమైన టీజర్ వీడియోను విడుదల చేసింది. ‘‘ముందు కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం..’’ అంటూ టబు చెబుతున్న డైలాగ్, ఆమె లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఖాకీ యూనిఫామ్‌లో ఆమె నడిచి వచ్చే తీరు, ఆమె ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
పూరి జగన్నాథ్ మార్క్ టేకింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విజయ్ సేతుపతి యాక్టింగ్‌తో పాటు, టబు రోల్ ఈ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుందని తాజా టీజర్ స్పష్టం చేస్తోంది. మాస్ సినిమాల మాంత్రికుడు పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి, టబు వంటి హ్యుజ్ కాంబినేషన్ వస్తుండటంతో సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఈ ప్రాజెక్ట్పై విపరీతమైన క్రేజ్ నెలకొంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
