Friday, May 17, 2024
- Advertisement -

చంద్రబాబుకు ఇవే చివ‌రి ఎన్నిక‌లా..?

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌లు ఎప్పుడు లేని విధంగా మంచి ర‌స‌వ‌త్త‌రంగా సాగాయి. ఓసారి ఓటుకు రెండు వేలు నుంచి 10 వేలు వ‌ర‌కు పంచార‌నే టాక్ వినిపిస్తోంది. అధికార టీడీపీ పార్టీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్ర‌మించాయి. గెలుపుపై రెండు పార్టీలు ధీమాగానే ఉన్నాయి. అయితే కాస్తా ఎడ్జ్ జ‌గ‌న్‌కే ఎక్కువ క‌నిపిస్తోంది. అయితే చంద్ర‌బాబు సొంత నిర్ణయాలే టీడీపీ పార్టీకి ఓట‌మి కార‌ణాలు అవుతాయ‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా పార్టీలో అస‌మ్మ‌తి ఎక్కువైందని పార్టీ నేత‌లే చెప్పుకోవ‌డం విశేషం. వారిని కంట్రోల్ చేయ‌డంలో చంద్ర‌బాబు ఘోరంగా విఫ‌లం చెందార‌ని అంద‌రికి తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఇక టికెట్ల పంప‌కంలో కూడా కుల ప్ర‌తిపాదిక‌ను పాటించ‌లేద‌ని విమ‌ర్శ వినిపిస్తోంది. జ‌గ‌న్ త‌న పార్టీ త‌రుపున బీసీల‌కు ఎక్కువ సీట్లు కేటాయించిన‌ప్ప‌టికి , టీడీపీ బీసీ నాయ‌కుల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని తెలుస్తోంది. టీడీపీకి మొద‌టి నుంచి బీసీ కులాలే అండ‌గా నిలుస్తు వ‌స్తున్నాయి.

కాని ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఇచ్చిన ఉచిత విద్య‌. ఆరోగ్య శ్రీ వంటి మొద‌ల‌గు హామీల‌తో బీసీలు కూడా టీడీపీకి దూరం కావ‌చ్చు అనే మాట వినిపిస్తోంది. ఇక ఈసారి ఎక్కువుగా కేసుల‌తో సంబంధాలు ఉన్న నాయ‌కుల‌కే టిక్కెట్లు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇవ‌న్ని ఒక లేక్క‌ అయితే పోల‌వ‌రం పూర్తి కాకుండానే పూర్తి అయింద‌ని చెప్పి ప్ర‌భుత్వం ఖ‌జానాతో ప్ర‌జ‌ల‌ను పోల‌వ‌రం సంద‌ర్శ‌నానికి తీసుకువెళ్ల‌డం, పార్టీకి చెందిన వారికే ఎక్క‌వుగా పనులు కావ‌డం వంటివి చంద్ర‌బాబుకు పెద్ద మైన‌స్‌గా మారాయాని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. చాలామంది చంద్రబాబుకి ఇవే చివ‌రి ఎన్నిక‌లు కూడా కావ‌చ్చ‌ని చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌న‌ర్హం. మ‌రి వీటిన్న‌టికి దాటుకుని చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తారేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -