Monday, May 20, 2024
- Advertisement -

2014లో టీడీపీ..2019లో వైసీపీ..మరి ఇప్పుడెవరిది?

- Advertisement -

ఏపీలో రాజకీయంగా ప్రాతినిధ్యం ఉన్న జిల్లాల్లో మరొకటి శ్రీకాకుళం. గౌతు లచ్చన్న,ఎర్రన్నాయుడు,విశ్వనాథం,పాలవలస రాజశేఖర్ వంటి నేతలు ఈ జిల్లా నుండే ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఆవిర్భావం నుండి కంచుకోటగా ఉంది. అయితే 2019 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

2019 లో జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైసీపీ 8 ,టీడీపీ రెండు చోట్ల గెలిచింది. ఇక శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఈసారి రామ్మోహన్ నాయుడు కూటమి నుండి పోటీ చేస్తుండగా వైసీపీ నుండి పేరాడ తిలక్ పోటీలో ఉన్నారు. కూటమిలో భాగంగా టీడీపీ 9,ఒక్క పాలకొండలో జనసేన పోటీ చేస్తోంది.

వైసీపీ రెండు చోట్ల రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగుల్ని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి పోటీ చేస్తుండగా రాజాం నుంచి తలే రాజేష్‌ బరిలో ఉన్నారు. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. టీడీపీ సైతం గెలుపే ప్రామాణికంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలుగా ఉన్న వారికే టికెట్ ఇచ్చింది. ఏపీ రాజకీయాల్లో ఓ సెంటిమెంట్ ఉంది. ఈ జిల్లాలో ఎవరు మెజార్టీ స్థానాలు సాధిస్తే వారిదే అధికారం ఉన్న సెంటిమెంట్ ఉండటంతో టీడీపీ,వైసీపీ ఈ జిల్లాపై పట్టు సాధించేందుకు తమదైన శైలీలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టిన జిల్లా ప్రజలు ఈసారి ఎవరి వైపు ఉంటారోనన్న అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -