- Advertisement -

దానం.. సోమవారం ఖాయం

- Advertisement -

కొన్ని రోజులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దానం నాగేందర్.. పార్టీ మారడం ఖాయమన్న వార్తలు ఊపందుకున్నాయి. రోజూ జరుగుతున్న పరిణామాలు చూస్తే అది నిజమే అని కూడా అనిపిస్తోంది. ఒకప్పటి కాంగ్రెస్ అగ్రనాయకుడు.. ప్రస్తుతం టీఆర్ఎస్ సీనియర్ నాయకుల్లో ఒకరు అయిన డీ. శ్రీనివాస్ తో దానం ప్రత్యేకంగా భేటీ అవడం.. ఆ సమావేశంలో టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుతో పాటు మరికొందరు కూడా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్.. దానం నాగేందర్ కు ఫోన్ చేయడం.. సమస్యలను హై కమాండ్ త్వరలోనే పరిష్కరిస్తుందని హామీ ఇవ్వడంతో.. కొన్ని రోజులు వెయిట్ చేసేందుకే దానం డిసైడైనట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్ల పై పూర్తి అధికారాల్ని తనకే ఇవ్వాలని కొంత కాలంగా దానం పట్టుబడుతుండడంతో.. అందుకే ఓకే చెప్పాలని హై కమాండ్ కూడా భావిస్తోందట. ఇదే విషయంపై.. రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నేతలైన సబితా ఇంద్రారెడ్డి, మరికొందరితో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం.

అక్కడితో ఆగని హై కమాండ్.. పార్టీ దూతగా షబ్బీర్ అలీని రంగంలోకి దింపింది. దానం ఇంటికి స్వయంగా వెళ్లిన షబ్బీర్.. ఆయనతో పాటు కలిపి ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. దానం కాంగ్రెస్ లోనే ఉంటారని స్పష్టం చేశారు. కానీ.. తను పార్టీ మారడం లేదని.. కాంగ్రెస్ లోనే ఉంటానని దానం మాత్రం స్పష్టం చేయలేదు. ఇదే.. అందరిలో అనుమానాలకు కారణమవుతోంది. అదీ కాక… ప్రతిపక్ష పార్టీలకు అధికారపార్టీ ఆఫర్లు కామన్.. నాయకులు వెళ్లిపోవడం కూడా కామన్ అనే డైలాగ్ అంతకుముందే దానం చెప్పి ఉన్నారు. ఇంకా తనకు.. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి గతంలో మారిన చరిత్ర కూడా ఉంది. ఇవన్నీ లెక్కలేస్తున్న రాజకీయ విశ్లేషకులు.. దానం పార్టీ మారడం ఖాయం అని ఫిక్స్ అవుతున్నారు. కుదిరితే.. ఒకట్రెండు రోజుల్లోనే..  దాదాపుగా ఈ సోమవారమే (7-12-15) క్లారిటీ వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది.

ఒక వేళ సోమవారం కాకున్నా.. ఏదో ఒక రోజు దానం గోడ దూకడం ఖాయం అని.. ఆయన సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -