Friday, May 3, 2024
- Advertisement -

షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్ కోటా మెడికల్, డెంటల్ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక ఎంసెట్ ప్రవేశ పరీక్షను వచ్చే నెల 9న నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు షెడ్యూల్ ను విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేట్ మెడికల్ కళాశాలల్లో కన్నీన్వర్ కోటా సీట్ల భర్తీ కోసం ఈ ఎంసెట్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం జూన్ 1 తేది నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఏడో తేది దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది.  జూన్ 14 తేదీ వరకూ 500 రూపాయలు, 21 వ తేదీ వరకూ వెయ్యి రూపాయలు, 28 వ తేది వరకూ ఐదు వేల రూపాయలు, జూలై ఆరో తేది వరకూ 10 వేల రూపాయల అపరాధ రుసుంతో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలే 2 నుంచి 7 తేది వరకూ హాల్ టిక్కట్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది.

జూలై 9న ఎంసెట్  2 పరీక్ష, ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు. 12 వ తేది వరకూ కీ పై అభ్యంతరాలుకు అవకాశం కల్పిస్తారు. జూలై 14 వ తేదిన ర్యాంకులను ప్రకటిస్తారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -