Sunday, May 19, 2024
- Advertisement -

తెలంగాణ నేతలకు ఇవ్వమన్న లోకేష్

- Advertisement -

తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ హడావుడి ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి నాలుగు రాజ్యసభ స్ధానాలు దక్కే అవకాశాలున్నాయి. ఇందుకోసం పార్టీలో నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. పార్టీలో సీనియారిటీ, ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి అవకాశం కల్పించాలని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది.

తెలుగుదేశం పార్టీ మహానాడు కూడా జరుగుతూండడంతో రాజ్యసభ ఎన్నికలపై పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సభ్యుల ఎంపికపై బిజెపితో ఎలాంటి చర్చలు జరపలేదని, ఈసారికి ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలో.. వద్దో అన్నది పార్టీ అధినాయకుడు చంద్రబాబు నిర్ణయిస్తారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన వారికి అవకాశం ఇచ్చేది లేదని, ఈ విషయం తమ నాయకుడు ఇదివరకే స్పష్టం చేశారని ఆయన అన్నారు. నవంబర్ నెల నుంచి తెలుగుదేశం కార్యకర్తలకు కొత్త ఆరోగ్య భీమా పాలసీ తాసుకురానున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ 58 లక్షల మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారని ఆయన తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -