Tuesday, May 6, 2025
- Advertisement -

తెలంగాణా స‌ర్కార్‌కు ఎదురు దెబ్బ‌….కొత్త మున్సిప‌ల్ చ‌ట్టానికి బ్రేక్‌

- Advertisement -

తెలంగాణా ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌శింహ‌న్ షాక్ ఇచ్చారు. నూతన మున్సిపల్ చట్టం 2019 ప్రకారం ఎన్నికలకు వెళ్దామని భావించిన కేసీఆర్ గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. కొత్త మున్సిపల్ చట్టంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన గవర్నర్ నరసింహన్… అసెంబ్లీ ఆమోదించిన కొత్త మున్సిపల్‌ బిల్లు 2019కు ఆయన బ్రేక్ వేశారు. మున్సిపల్ చట్టానికి పలు సవరణలు అవ‌స‌ర‌మ‌ని బిల్లును వెన‌క్కి తిప్పి పంపారు.

ఎన్నికల తేదీ ఖరారు ప్రభుత్వ పరిధిలో ఉండటంపై గవర్నర్ అభ్యంతరం తెలిపారు. ప్రజాప్రతినిధుల తొలగింపు అధికారం కలెక్టర్లకు అప్పగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రొరోగ్‌ కావడంతో.. గవర్నర్‌ నరసింహన్‌ సూచించిన సవరణలతో తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌‌ను జారీ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -