Sunday, May 19, 2024
- Advertisement -

ఎయిర్‌టెల్‌లో టెలీనార్ విలీనం… వూడ‌నున్న 700 మంది ఉద్యోగాలు

- Advertisement -

టెలినార్ ఎట్టకేలకు ఎయిర్ టెల్ లో కలసిపోయింది. టెలినార్‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు షాక్ గుర‌య్యో ఈ మెయిల్స్ వచ్చాయి. ఉద్యోగం నుంచి తొలగించే లక్ష్యంతో పంపిన మెయిల్స్ కావడంతో వారిలో ఆందోళన మొదలైంది. దాదాపు 00 మంది ఉద్యోగులు ఇంట‌కి వెల్ల‌నున్నారు.

హెచ్ ఆర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని ఎయిర్ టెల్ కోరింది. ఏం చేయాలన్నది సమావేశంలో చర్చించాల్సి ఉందని పేర్కొంది. ఎయిర్ టెల్ దీన్ని ధ్రువీకరించింది. టెలినార్ లో ఉన్న ఉద్యోగులు అందరికీ ఎయిర్ టెల్ లో తగిన ఉద్యోగాలు లేవని స్పష్టం చేసింది. టెలినార్ కు ఉన్న 1,400 మంది ఉద్యోగుల్లో 700 మందిని సర్దుబాటు చేసుకున్నట్టు తెలిపింది. అంటే మరో 700 మందిని సాగనంపుతున్నట్టు పరోక్షంగా . ఈ నెల 14న టెలికం శాఖ ఎయిర్ టెల్-టెలినార్ విలీనానికి ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -