Sunday, May 19, 2024
- Advertisement -

క్రీడాస్పూర్తిని చాటిన పాండ్యా, రాహుల్ ….

- Advertisement -

కీల‌క మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 పరుగుల తేడాతో అనూహ్యంగా ఓటమిపాలైంది. విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు అవసరమైన దశలో రాహుల్‌ను బుమ్రా ఔట్ చేయడంతో.. మ్యాచ్ ముంబై వైపు మొగ్గింది. విజ‌యంపై ధీమాగా ఉన్న పంజాబ్‌ను చివర్లో బుమ్రా అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మార్చేశాడు.

ఈ సీజన్లో ఆరు అర్ధ సెంచరీలు చేసి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నెముకగా ఉన్న రాహుల్ (95*) రాజస్థాన్‌పై విజయం కోసం కడదాకా పోరాడాడు. ముంబై మీద కూడా ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. కానీ జట్టు ఓటమితో రాహుల్ నిరాశ చెందాడు. తీవ్రంగా పోరాడిన ఓడినప్పటికీ.. క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు

మ్యాచ్‌ ముగిసిన తర్వాత రాహుల్‌ వద్దకు వెళ్లిన ముంబై ఇండియన్స్‌ ఆటగాడు హర్ధిక్‌ పాండ్యా తన జెర్సీని తీసి రాహుల్‌కు ఇచ్చి స్పోర్ట్స్‌మ్యాన్‌ స్పిరిట్‌ను చాటుకున్నారు. అందుకు ప్రతిగా రాహుల్‌ కూడా పంజాబ్‌ జెర్సీని హర్ధిక్‌కు అందజేశారు. 94 పరుగుల వద్ద రాహుల్‌ను బుమ్రా అద్భుతమైన బాల్‌తో ఔట్‌ చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లు లక్ష్యాన్ని చేధించలేకపోవడంతో 3 పరుగుల తేడాతో ముంబై గెలిచి ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -