Thursday, May 9, 2024
- Advertisement -

ఉత్కంఠ‌పోరులో పంజాబ్‌పై ముంబ‌య్ గెలుపు…

- Advertisement -

పంజాబ్‌, ముంబ‌య్ మ‌ధ్య ఉత్కంఠంగా సాగిన పోరులో రోహిత్ సేన మూడు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఇరు జ‌ట్ల‌కు ముఖ్య‌మైన మ్యాచ్ కావ‌డంతో ముంబ‌య్ గెలిచి ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ఇంచుమించు చేజారిపోయిన మ్యాచ్‌ను తమవైపు తిప్పేసుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.

పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (60 బంతుల్లో 94; 10×4, 3×6) మెరుపులు వృథాగా పోయాయి. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఓపెనర్ క్రిస్ గేల్ (11 బంతుల్లో 18; 2×4, 1×6) ఔటయ్యాడు. అయితే ఆరోన్ ఫించ్ (35 బంతుల్లో 46; 3×4, 1×6)తో కలసి రాహుల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలసి రెండో వికెట్‌కు 111 పరుగుల విలువైన భాగస్వామాన్ని నెలకొల్పారు.

పంజాబ్‌ విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు కావాల్సి ఉండగా బుమ్రా పంజాబ్‌ విజయాన్ని లాగేశాడు. అద్భుత బంతితో రాహుల్‌ (94: 60 బంతులు,10 ఫోర్లు,3సిక్స్‌లు)ను బోల్తా కొట్టించిన బుమ్రా ఈ ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు . చివరి ఓవర్లో పంజాబ్‌ విజయానికి కావాల్సిన 17 పరుగులను చేయడంలో యువరాజ్‌ సింగ్‌, అ‍క్షర్‌ పటేల్‌లు విఫలమవ్వడంతో పంజాబ్‌ ఓటమిని చవిచూసింది.

అయితే 20వ ఓవర్ మూడో బంతికి యువరాజ్ సింగ్(1) ఔటయ్యాడు. దీంతో ముంబై విజయం ఖరారైపోయింది. నాలుగో బంతికి అక్షర్ పటేల్(10 నాటౌట్) సిక్స్ బాదినా ఫలితం లేకపోయింది. ఆఖరి రెండు బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా ఐదో బంతికి లెగ్ బై ద్వారా ఒక పరుగు వచ్చింది. ఆఖరి బంతిని మనోజ్ తివారి ఫోర్ బాదాడు. దీంతో 3 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది.

అంతకు ముందు కీరన్ పొలార్డ్ (23 బంతుల్లో 50; 5×4, 3×6) చెలరేగడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్(15 బంతుల్లో 27; 3×4, 2×6), ఎవిన్ లూయిస్ (9) మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అయితే మూడో ఓవర్‌లో ఆండ్రూ టై వేసిన తొలి బంతికే లూయిస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్ (12 బంతుల్లో 20; 1×4, 2×6) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే ఆండ్రూ టై వేసిన ఆరో ఓవర్‌లో స్టాయినిస్‌కు క్యాచ్ ఇచ్చి కిషన్ వెనుదిరిగాడు. ఆ తరవాత బంతికే సూర్యకుమార్ యాదవ్‌ను టై ఔట్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (6) మరోసారి నిరాశపరిచాడు. అయితే పొలార్డ్ పోరాటంతో ముంబై భారీ స్కోరు సాధించగలిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -