ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ విషయం పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే లక్షల్లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వైరస్ బారినపడే అవకాశాలున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను ఏపీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను ఏపీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని.. విపత్కర పరిస్థితుల్లోనూ విపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదు. కరోనా తీవ్రతను బట్టి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించింది.
టెన్త్, ఇంటర్లపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‍కే నష్టమని పేర్కొన్నారు. పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని ప్రతిపక్షాలు గ్రహించాలి.. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. కొవిడ్‌పై పోరాటంలో కచ్చితంగా గెలుస్తామని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. ఇంటికప్పు కూలి ఐదుగురి మృతి