Wednesday, May 7, 2025
- Advertisement -

వారి బదిలీ వీళ్ళ గొడవకి నాంది..!

- Advertisement -

బంగాల్​కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్​ అంశంపై కేంద్రానికి, మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. ముగ్గురు అధికారులను తక్షణమే పంపాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరోసారి ఆదేశాలు పంపింది. ఈ విషయంపై మమతా మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం అనుమతి లేకుండా ఐపీఎస్ అధికారులను కేంద్రానికి పంపాలనడం అధికార దుర్వినియోగమనేని, ఇది ఐపీఎస్ కేడర్​ అత్యవసర నిబంధన-1954ను వక్రీకరించడమేనని ధ్వజమెత్తారు.

విస్తరణవాదులకు, అప్రజాస్వామిక శక్తులకు తలవంచే ప్రసక్తే లేదని కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు మమత. మరోవైపు కేంద్రం మాత్రం ముగ్గురు ఐపీఎస్​ అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు కూడా అప్పగించిందని, వీలైనంత త్వరగా వారిని పంపాలని బంగాల్​ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బంగాల్​లో గతవారం పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్​పై రాళ్లదాడి జరిగింది. ఇందుకు భద్రతా ఏర్పాట్ల వైఫల్యమే కారణమని కేంద్రం భావించింది. నడ్డా పర్యటనకు భద్రతా ఏర్పాట్లు సమీక్షించిన ముగ్గురు ఐపీఎస్​ అధికారులు కేంద్రానికి రావాలని గతవారమే మొదటిసారి ఆదేశించింది. ఇప్పుడు మరోసారి ఉత్తర్వులు పంపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -