బీజేపీ ఫోన్ కాల్స్ ఫలిస్తాయా ?

- Advertisement -

దేశంలో రాష్ట్రపతి ఎన్నికల నగార మోగింది. ఈ నెల 18 రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతుండగా 21న ఓట్ల లెక్కింపు జరగనుంది. భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ పదవీకాలం ఈ నెల 24 తో ముగుస్తుండడంతో, మన దేశ తదుపరి రాష్ట్రపతి ఎవరనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల కోసం తమ అభ్యర్థులను రేసులో నిలబెట్టేందుకు ప్రధాన పార్టీలు సిద్దమౌతునాయి.ముఖ్యంగా బీజేపీ తమ అభ్యర్థిని రాష్ట్రపతిగా చూసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. .

దాంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం కోసం అధికార బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టగా, అటు విపక్షాలు కూడా తమ అభ్యర్థులను రేస్ లో నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయం తీసుకొచ్చే బాద్యతను భారత జనతా పార్టీ .. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు అప్పగించగా ఆయన ఇప్పటికే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే వివిధ పార్టీల నేతలకు రాజ్ నాథ్ సింగ్ పోన్ కాల్స్ ద్వారా టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తో పోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఒక్క మమతా తోనే కాకుండా కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే తోను, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తోను, పోన్ లో మాట్లాడి.. జులై 18 జరిగే రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మద్దతు కోరినట్లు సమాచారం. అయితే విపక్షాలు బీజేపీ కి ఎంతవరకు మద్దతిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే విపక్షాలు సైతం తమ అభ్యర్థులను రేస్ లో నిలిపేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. దాంతో రాష్ట్ర పతి ఎన్నికలు ఏకగ్రీవంగా ఉంటాయా ? లేదా హోరాహోరీ పోరుతో రసవత్తరంగా మారతాయా ? అనేది దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఓటుకు లంచం ..27పైసలు !

టీడీపీ మైండ్ గేమ్ స్టార్ట్ ?

జగన్ కు మరో తలనొప్పి ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -