Tuesday, May 6, 2025
- Advertisement -

తిరుమలలోనే అంజనీపుత్రుడి జననం

- Advertisement -

అంజనీ సుతుడు హనుమంతుడు తిరుమల కొండపై జన్మించాడని టీటీడీ విశ్వసిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన ఓ పుస్తకాన్ని ఇవాళ టీటీడీ విడుదల చేయనుంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల గిరులపై ఆకాశగంగకు సమీపంలో ఉన్న అంజనాద్రి కొండల్లోనే హనుమాన్​ జన్మించాడని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ అంశాన్ని ఈ నెల 13న ఉగాది రోజున అధికారికంగా ప్రకటించనుంది. ఏపీలో తిరుమల క్షేత్రంలో గల జాపాలి తీర్థం ఇందులో ఒకటి. ఆంజనేయుడు ఇక్కడే జన్మించినట్లు కొన్ని పురాణాలు చెబుతున్నాయి.

ఏడుకొండలలో ఒకటైన అంజనాద్రిపై వెలసిన జాపాలి వద్ద హనుమంతుడు పుట్టినట్లు కొన్ని స్థల పురాణాల్లో ఉంది. ఇక్కడి అటవీ ప్రాంతంలో పురాతన ఆంజనేయ ఆలయం ఉంది. స్థానికులతో పాటు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు జాపాలి వద్దకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే కొంతమంది హనుమాన్ భక్తులు ఆయన్ను కలిశారు. ఆ నాటి నుంచి ఈ విషయంపై పరిశోదనలు ఎక్కువగా జరిగాయి.

అంజనీపుత్రుడి జన్మస్థానం ఆధారాల సేకరణకు గత 2020 డిసెంబరులో కమిటీ ఏర్పాటైంది. కమిటీ సభ్యులు అనేక సార్లు సమావేశమై చర్చించారు. ఆంజనేయుడు ఎక్కడ జన్మించాడన్న విషయాన్ని కచ్చితంగా నిర్ధారించేందుకు కమిటీ ఐదు పురాణాలను, అనేక గ్రంథాలను పరిశీలించింది. అంజనాదేవి ఆకాశగంగ తీర్థంలో 12 ఏళ్ల పాటు తపస్సు చేయగా వాయుదేవుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఫలాన్ని ఆమె తిన్నదని, ఆకాశగంగా సమీపంలోనే హనుమంతుడి జన్మస్థలమని తెలిపారు.

ఈ మేరకు హన్మంతుడి జన్మస్థానం కనిపెట్టేందుకు ఏర్పాటైన కమిటీ నాలుగు నెలల పాటు వివిధ పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెలికితీసింది. ఈ మేరకు పరిశోధన వివరాలను కమిటీ సభ్యుడు మురళీధరశర్మ వెల్లడించారు. వెంకటాచల మహత్మంలోనూ అంజనాద్రి ప్రస్తావన ఉందని, ఇక్కడే అంజనాదేవికి హనునమంతుడు పుట్టాడని వెల్లడించారు.

టీడీపీకి లోకేష్ అనే వైరస్ పట్టుకుంది.. వర్మ సంచలన ట్విట్!

ప్రైవేట్ టీచర్లకు నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ!

టాలీవుడ్‌లో విషాదం.. నిర్మాత CN రావు మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -