Friday, April 26, 2024
- Advertisement -

హనుమంతుని జన్మస్థలంపై చర్చల్లో ప్రతిష్టంభన!

- Advertisement -

హనుమంతుని జన్మస్థలంపై హాట్ హాట్ గా చర్చలు కొనసాగుతున్నాయి. టీటీడీ –హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మధ్య చర్చలు జరుగుతున్నాయి. వాడీవేడిగా చర్చలు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన చర్చలో టిడిపి సాంస్కృతిక విద్యాపీఠం వీసీ మురళీధర్ శర్మ, టీటీడీ ప్రత్యేక కార్య నిర్వహణాధికారి ధర్మారెడ్డి, హ‌నుమాన్ జ‌న్మ‌భూమి తీర్ధ‌క్షేత్ర ట్ర‌స్టు తరఫున గోవిందానంద స్వామి పాల్గొన్నారు. టీటీడీ ఆధారాల్లో తప్పులు ఉన్నాయని స్వామి గోవిందానంద సరస్వతి అన్నారు. టీటీడీ పూర్తి నివేదిక అందిస్తే తప్పులు చూపిస్తానని పేర్కొన్నారు. నివేదిక ఇవ్వడం కుదరదని టీడీపీ తేల్చిచెబుతోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే హనుమంతుడి జన్మస్థలంపై కొనసాగుతోన్న వివాదం ఇప్పటిది కాదు.

అంజనాదేవి తిరుమలలోనే హనుమంతుడికి జన్మనిచ్చిందనేది టిటిడి వాదన. కాదు హనుమంతుడు కిష్కింధలోనే జన్మించాడని గోవిందానంద స్వామిజీ వాదన. పూర్తి నివేదిక ఇస్తేనే మాట్లాడతానని గోవిందానంద స్వామీజీ పట్టుబట్టడంతో చర్చ అసంపూర్తిగా ముగిసింది. హనుమంతుని జన్మస్థలంపై హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తో చర్చకు టీటీడీ రెడీ అయింది. గురువారం తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో హనుమంతుని జన్మ స్థలంపై ఇరు పక్షాల మధ్య చర్చలు జరిగాయి.

కిష్కింద ట్రస్ట్ తరుపున చర్చలో శ్రీ గోవిందానంద సరస్వతి పాల్గొన్నారు. టీటీడీ తరుపున చర్చలో కమిటీ కన్వీనర్, సభ్యులు పాల్గొన్నారు. గత ఏప్రిల్ 13న ఉగాది సందర్భంగా టీటీడీ తిరుమలలోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలమని ప్రకటించింది. శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సన్నిధానం సుదర్శన శర్మ నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల నిపుణుల కమిటీ 2020 డిసెంబర్ లో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ప్రకటన వెలువడింది.

దానిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ టీటీడీకి లేఖలు రాసింది. బహిరంగ చర్చకు రావాలంటూ టీటీడీకి సవాలు చేసింది. హనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్టు సవాల్ కు స్పందించింది. మరి ఈ చర్చలు ఎప్పటి వరకు సాగుతాయో.. హనుమాన్ జన్మస్థలం పై వివాదం ఎప్పుడు ముగుస్తుందో వేచి చూడాలి.

ఆనందయ్య ఇచ్చేది మందు కాదురా.. చట్నీరా: బాబు గోగినేని

మాస్క్ పెట్టుకోలేదని కాళ్లు, చేతులకు మేకులు దింపిన యూపీ పోలీసులు

ఏపిలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వాయిదా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -