Friday, April 26, 2024
- Advertisement -

ప్రైవేట్ టీచర్లకు నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ!

- Advertisement -

కరోనా లాక్ డౌన్‌తో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో ప్రత్యేకంగా చెప్పన్కకలేదు. ముఖ్యంగా కరోనా కాటుకు ఎక్కువగా ఇబ్బంది పడ్డవారిలో వలస కూలీలు, విద్యా సంస్థలకు చెందిన బోధన, బోదనేతరులు బాధపడ్డారు. వారికోసం తెలంగాణ ప్రభుత్వం ఓ అమూల్యమైన కానుక ఇచ్చింది. ప్రైవేట్ టీచర్లకు నెలకు రూ. 2000 నగదుతో పాటు.. 25 కిలోల బియ్యం కూడా పంపిణీ చేస్తామని ప్రకటించింది.

దాంతో బోధన, బోదనేతరులు చెందిన వారి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు. వీటిని డీఈఓల ద్వారా పరిశీలించారు. ఆయా జిల్లా కలెక్టర్ల సారధ్యంలో అర్హులైన వారికి అందజేయనున్నారు. ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన సాయంలో భాగంగా బియ్యం పంపిణీ ప్రారంభమైంది.

జిల్లా విద్యా సమాచార వ్యవస్థ – యూడైస్లో ఉన్న సమాచారంతో వాటిని పరిశీలించారు. లక్ష 25 వేల మంది వరకు ఉపాధ్యాయులు, సిబ్బందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఈ కుబేర్ ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ఆర్థిక శాఖ నగదు జమచేస్తోంది. నేటి నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ఒక్కో కుటుంబానికి 25 కేజీల చొప్పున సన్నబియ్యాన్ని ఉచితంగా ఇస్తారు.

టాలీవుడ్‌లో విషాదం.. నిర్మాత CN రావు మృతి!

నేడు సీతారాముల కల్యాణం.. కానీ..

నేటి పంచాంగం,బుధవారం(21-04-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -