- Advertisement -

ఇలా చేస్తే..కొవ్వు తగ్గడం ఖాయం!

- Advertisement -

ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ సమస్య అందరిలో సర్వసాధారణం అయిపోయింది. మారుతున్న జీవన శైఈలో ఇందుకు ప్రధాన కారణం. నిత్యం కూర్చొని పని చేయడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రధానంగా కడుపు, తొడల భాగంలో కొవ్వు పేరుకొని పోయి లావుగా కనిపిస్తుంటారు. ప్రతి రోజూ వ్యాయామం చేయడం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

యాలకులతో తిన్న ఆహారం సాఫీగా జీర్ణమై శరీరానికి తగినంత జీవశక్తిని ఇస్తుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించే గుణం యాలకుల్లో ఉంది. అలాగే మిరపకాయలోని క్యాప్‌సైసిన్ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. వెల్లుల్లిలోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి.

తరచూ క్యాబేజీని వండుకుతినే వాళ్లలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో క్యాబేజీ కూరలు చేయకుండా, ఉడికించిన క్యాబేజీ కూరలు తింటేనే శరీరానికి ఎంతో మేలు. పెసరపప్పులో ప్రొటిన్స్ అధికం. అలాగే విటమిన్ ఎ, బి, సి, ఇ, ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందుకే పెసరపప్పును ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. రాగి, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు ఎక్కువ ఫైబర్ లభిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -