Tuesday, May 6, 2025
- Advertisement -

మీ ఆహారంలో ఇవి ఉంటే..100 ఏళ్లు బతికేయవచ్చు!

- Advertisement -

మారుతున్న కాలం, తీసుకుంటున్న ఆహారపు అలవాట్లు మనిషి జీవించే కాలాన్ని తగ్గించేస్తోంది. ఫలితంగా చిన్న వయసులోనే గుండెపోటు,60 ఏళ్లు నిండకుండానే మృత్యువాత పడుతున్నారు. అయితే మన ఆహారంలో కొన్ని మార్పులు చేసి, విటమిన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేయడమే కాదు 100 ఏళ్లు బ్రతికే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

విటమిన్ డీ. రోగనిరోధక శక్తిని పెంచడంమే కాదు ఎముకలు గట్టిపడటానికి, మానసిక స్థితి నియంత్రణలో ఉండటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి తగ్గితే క్యాన్సర్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. సూర్యకాంతి, చేపల్లో విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది.

ఇక విటమిన్ సి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. గాయాలను త్వరగా తగ్గించడమే కాదు ఐరన్ లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వృద్ధాప్యంలో వచ్చే కొన్ని వ్యాధుల బారి నుండి బయటపడే వచ్చు. బ్రోకలీ, బెల్ పెప్పర్స్, కివి, సిట్రస్ పండ్లలో సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది.

విటమిన్ ఈ. బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఒత్తిడ, వాపు నుండి కణాలను రక్షించడంలో సహామపడుతుంది. అలాగే చర్మ సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అల్జీమర్స్ వ్యాధిను తగ్గించడానికి దోహదపడుతుంది. గింజలు, బచ్చలికూర, కూరగాయలు, తృణధాన్యాల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ బీ12. మానవ శరీరంలో ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచడంలో కీలక పాత్ర. రక్తహీనత,గుండె జబ్బుల నుండి రక్షించడంలో చాలా ముఖ్యమైంది. మాంసం, సీ ఫుడ్, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో బీ 12 సమృద్ధిగా లభిస్తుంది.

విటమిన్ K2..రక్తం గడ్డకట్టకుండా ఉండానికి, గుండె ఆరోగ్యంతో పాటు ఎముకలను పటిష్టంగా ఉంచడానికి అవసరం. ఆహార వనరులలో చీజ్, గుడ్డు వంటి వాటిలో సమృద్ధిగా లభిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -