Friday, May 17, 2024
- Advertisement -

ఇవి తింటే ఎంత ఎనర్జీనో తెలుసా?

- Advertisement -

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం, నిద్ర, మన జీవన శైలి ఇవన్నీ కూడా మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండటం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా, పూర్తిగా ఆరోగ్యంగా వుండ గలుగుతాము.అలాగని పూర్తిగా పోషకాలు కలిగిన ఆహారం మాత్రమే కాకుండా మన శరీరంలో జరిగే జీవక్రియలు సక్రమంగా జరగాలంటే మన శరీరానికి ఎనర్జీ కూడా ఎంతో అవసరం.అందుకే మన శరీరానికి ఎనర్జీని అందించే ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. మరి ఎనర్జీని అందించే ఆహార పదార్థాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

అరటి పండ్లు: సీజన్ తో పని లేకుండా అన్ని సీజన్లలో దొరికే పండ్లలో అరటి పండు ఒకటి. అరటి పండులో అధిక మొత్తంలో నేచురల్ షుగర్స్ అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉంటాయి. ఇవి మన శరీరంలో శక్తిని ప్రేరేపిస్తాయి.అలాగే అరటిపండులో పొటాషియం ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి సరైన పోషకాలు అందించడమే కాకుండా తగినంత మోతాదులో శక్తిని కూడా అందిస్తుంది.

నట్స్ మరియు గింజలు: మన రోజువారీ ఆహారంలో భాగంగా కొద్ది మొత్తంలో నట్స్ మరియు గింజలు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. అదేవిధంగా వీటిలో ఎన్నో పోషకాలతో పాటు విటమిన్స్ కూడా దాగి ఉన్నాయి.

Also read:ఏడాదిలో రూ.150 కోట్లు వదులుకున్న ప్రభాస్..?

మొలకలు: మొలక కట్టిన గింజలలో ఎన్నో పోషక పదార్థాలు దాగి ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం గుప్పెడు వివిధ రకాల గింజలతో మొలకలు కట్టి వాటిని తినడం ద్వారా మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. అదేవిధంగా ఈ మొలకలలో
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఈ గింజలను తినడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

Also read:పాపం.. ఆ నటుడుకి డైరెక్టర్ వంశి జీవితంపై విరక్తి కలిగించాడట!

యోగర్ట్: మన ఆహారంలో భాగంగా నిత్యం యోగర్ట్ ను తగినంత పరిమాణంలో తీసుకోవాలి. ఇందులో ప్రోటీన్లు, క్యాల్షియం, కొవ్వులు అధికంగా ఉన్నాయి. యోగర్ట్ లో ప్రోబయోటిక్స్ అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో జీర్ణక్రియను పెంపొందింపచేస్తాయి. అదేవిధంగా మన శరీరానికి తగినంత ఎనర్జీని అందిస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -