Friday, March 29, 2024
- Advertisement -

ఈ పండు రోజుకొకటి తినండి.. మీకల నిజమౌతుంది

- Advertisement -

ఈ మధ్య మార్కెట్లోకి రకరకాల పళ్ళు వస్తున్నాయి. వీటిని చూసి పేరు తెలుసుకోకుండానే చాలామంది లైట్ తీసుకుని వెళ్లిపోతుంటారు. బట్ మీరు మాత్రం అలా చేయకండి. ఏ పండులో ఏ అమృతం దాగుందో మనకేం తెలుసు. అయితే ఈసారి మనం సరికొత్త పండు గురించి తెలుసుకోబోతున్నాం. అదేమిటో తెలుసా. ఇంకేంటి డ్రాగన్ ఫ్రూట్ . అదేంటి చైనా పేరు ఉంది..ఇది చైనా నుంచి వస్తుందా అని మనందరికీ ఒకే డౌట్ రావచ్చు. అయితే ఈ పండు వెలుగులోకి వచ్చింది చైనాలోనే. దాంతో దీనికి ఆ పేరు వచ్చింది. ప్రజెంట్ మార్కెట్లో ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

డ్రాగన్ ఫ్రూట్ చూసేందుకు పింక్ రంగులో ఉంటుంది. దీన్ని హిందీలో పిటాయా అని పిలుస్తారు. చూసేందుకు డ్రాగన్‌ను పోలిన ఆకృతి ఉంటుంది కనుకనే దీనిని డ్రాగన్ ఫ్రూట్ అని ఎక్కువమంది పిలుస్తారు. డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా ఆసియాలోని చైనాతో పాటు కొన్ని ప్రాంతాలు, అమెరికా, ఆస్ట్రేలియాలలోను పండుతుంది. ఇక ఈ పండు రుచి కివీ, పైనాపిల్‌లను పోలి ఉంటుంది. ఈ క్రమంలోనే డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

2. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

3. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.

4. రక్త సరఫరా మెరుగుపడుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున హార్ట్ సమస్యలు రావు. హార్ట్ ఎటాక్‌లు, స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి.

5. డ్రాగన్ ఫ్రూట్ వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు.

6. డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -