Thursday, March 28, 2024
- Advertisement -

పనస గింజలతో రోగనిరోధకశక్తి నిజంగా పెరుగుతుందా?

- Advertisement -

మన శరీరం ఎటువంటి హానికర బ్యాక్టీరియా లో వైరస్ ల బారిన పడకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మన శరీరానికి కావలసినంత రోగనిరోధకశక్తి ఉండటం ఎంతో అవసరం. మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి ఉన్నప్పుడే మనం అంటువ్యాధులను ఎదుర్కోగలం.అయితే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని మెరుగు పరుచుకోవచ్చు. అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగు పరుచుకోవడానికి ఉత్తమమైన ఆహార పదార్థాలలో పనసపండు గింజలు ఒకటని చెప్పవచ్చు.

సాధారణంగా కొన్ని కాలాలలో మాత్రమే లభించే పనసపండును తినడానికి చాలా మంది ఇష్టత చూపుతుంటారు. చాలామంది చిన్నప్పుడు పనస పండ్లు తిని వాటి విత్తనాలను నిప్పులపై కాల్చుకొని తినే ఉంటాము. అయితే ఆ గింజలలో ఎన్నో పోషక పదార్థాలు దాగి ఉన్నాయి. పనస పండు గింజలలో ఎక్కువ భాగం ప్రోటీన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ గింజలు విటమిన్ సి, ఏ విరివిగా ఉంటాయి.

Also read:ఏడాదిలో రూ.150 కోట్లు వదులుకున్న ప్రభాస్..?

పనస పండు గింజలలో లభించే విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదం చేస్తుంది. అదే విధంగా క్యాన్సర్ వంటి వ్యాధులను ఎదుర్కొనే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఈ గింజలు అధికంగా ఉన్నాయి. పనస పండ్లు పొటాషియం మెగ్నీషియం ఫైబర్ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఇవి మన శరీరంలో రక్తాన్ని అభివృద్ధి చేయడానికి జీర్ణక్రియ సమస్యలను తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తాయి.

Also read:వార్ని.. అలాంటి భారీ ప్రాజెక్టు ను వదులుకున్న సమంత?

ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ పనసగింజలను కూర చేసుకొని తినవచ్చు. లేదా వీటిని స్నాక్స్ లాగా ఉప్పు కారం చల్లుకొని తీసుకోవచ్చు. ఈ గింజలలో జింక్ అధికభాగం ఉండటంవల్ల మన శరీరంలోని కణజాలాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుంది.అందుకోసమే మన శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడి జీవక్రియలు సక్రమంగా జరగడానికి పనస గింజలు కీలక పాత్ర పోషిస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -