Monday, May 20, 2024
- Advertisement -

మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లిన ఎంపీ.. వీడియో వైరల్!

- Advertisement -

పశ్చిమ బెంగాల్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా ఓ ఎంపీ పక్కనే కూర్చున్న మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు కాకరేపుతున్నాయి. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఎంసీ, బీజేపీ దూసుకెళ్తున్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వీడియో ఇప్పుడు బెంగాల్ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈక్రమంలో బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ తన ట్విటర్ ఖాతాలో వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో టీఎంసీ మహిళా సాధికారతకు నిదర్శనం అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ..తమ పార్టీకే చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం టీఎంసీకి తలనొప్పిగా మారింది. టీఎంసీకి చెందిన కొందరు నాయకులు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఎంపీ కల్యాణ్‌తో పాటు ఎమ్మెల్యే అలోక కూడా హాజరయ్యారు.

అయితే మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఎమ్మెల్యే బుగ్గను గిల్లారు ఎంపీ కల్యాణ్. అసలు విషయం ఏంటేంటే..ఈ ఎన్నికల్లో సారి ఆమెకు టికెట్ కూడా ఇవ్వలేదు. ఈ ఘటనతో బీజేపీ టీఎంసీపై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ వీడియో బీజేపీ నేత షేర్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. కాగా, దీనిపై స్పందించిన టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ స్పందిస్తూ.. ఆమె తన డర్టీ మైండ్‌ను బయటపెట్టుకున్నారు. అన్నా చెల్లెలి రిలేషన్ ఏంటో ఆమె తెలుసుకోవాలని సుద్దులు చెప్పారు. నేను కూడా బాన్‌కురా నియోజకవర్గానికి చెందిన వాడినే. 25 ఏళ్లుగా ఆమెను సొంతచెల్లిగా చూసుకుంటున్నా అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -