Friday, March 29, 2024
- Advertisement -

ఎవరు ఎక్కడ ఓటు వేశారు.. ఏం అన్నారు అంటే..!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం  2,214 డివిజన్, వార్డు స్థానాల్లో 580 ఏకగ్రీవం కాగా మిగతా వాటికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే, నాలుగు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 71 మునిసిపాలిటీలు, 12 నగర పాలక సంస్థల్లో పోలింగ్ జరుగుతోంది.

విశాఖ 14వ వార్డులోని మారుతీనగర్ పోలింగ్ కేంద్రం-11లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. జీవీఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో యాభై శాతం మించి పోలింగ్ నమోదు కాలేదని… ఈసారి ఓటింగ్ శాతం పెరగాలని ఆకాంక్షించారు.

14వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న సబ్బం హరి, విజయసాయిరెడ్డి.. పరస్పరం తారసపడ్డారు. మర్యాదపూర్వకంగా పలకరించిన సబ్బం హరికి దండం పెడుతూ ముందుకు కదిలారు విజయసాయిరెడ్డి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ పటమటలోని కొమ్మ సీతారామయ్య జెడ్పీ బాలికల హైస్కూలో ఓటు వేశారు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంవీపీ కాలనీలోని 17వ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు అందరూ ఓటు వేయాలని కోరారు. జీవీఎంసీ ఎన్నికలలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు… మాజీ ఐపీఎస్ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ. ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యతన్న ఆయన… ఓటింగ్ శాతం పెరగకపోతే ప్రశ్నించే హక్కు ఉండదన్నారు.

‘ఆదిపురుష్’ లేటేస్ట్ అప్ డేట్!

ఎన్నికల స్టంట్.. టీ కాచి సర్వీస్ చేసిన మమతా బెనర్జీ!

కృష్ణ జింక మాంసం కావాలా.. వీళ్ళు ఇస్తారు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -