Wednesday, May 8, 2024
- Advertisement -

హ…హా…….. నీకు కేసీఆర్‌కూ పోలికా పవన్…… కమెడియన్ హీరోతో పోల్చుకున్న వైనం కాదా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ ఏంటి? సినిమాల్లో అయితే మాత్రం కామెడీనే. ఇతర ఎమోషన్స్ అన్నింటికంటే కామెడీ చేయడంలోనే పవన్‌కి బలం ఎక్కువ. డ్యాన్స్‌లు, ఫైట్స్ గట్రా పక్కనపెడితే మిగతా అన్ని సీన్స్‌లోనూ మంచి కమెడియన్‌గా కనిపిస్తూ ఉంటాడు పవన్. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆ కామెడీనే నమ్ముకున్నాడు పవన్. కాకపోతే ఆ కామెడీని హీరోయిజం అనుకోండి అని చెప్పి అబద్ధాలతో ప్రజలను ఎర్రి ఎంగళప్పలను చేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు మాత్రం తానే ఆ ఎర్రి ఎంగళప్ప అయిపోతూ నెటిజనులకు కామెడీ పీస్ అయిపోతున్నాడు.

ప్యాకేజీలు, తెరవెనుక వ్యవహారాలతో చంద్రబాబును గెలిపించడం కోసం 2014 ఎన్నికలకు ముందు యమా అర్జెంట్‌గా జనసేన పార్టీని స్థాపించిన పవన్…..దాన్ని అతిపెద్ద హీరోయిజం అనుకోమంటున్నాడు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటికి ఉన్న నాయకులందరూ కూడా ఏదో ఒకటి చేసినవాళ్ళే…. ఒక్క పవన్ తప్ప. 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్…..2014లో విభజన పర్వం అయిపోయే వరకూ ఎంచక్కా ఫాం హౌస్ సుఖాలు, సినిమా షూటింగ్స్‌తో ఎంజాయ్ చేశాడు. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి చిరంజీవికి కొన్ని సీట్లు వచ్చేలా చేసిన పవన్ కూడా విభజనకు బాధ్యుడే. ఎందుకంటే తన స్వార్థం కోసం చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలపకుండా ఉండి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయేది. రాష్ట్ర విభజన అంశం మరుగునపడిపోయేది. ఇక 2014 ఎన్నికల్లో బాబు, మోడీలకు మద్దతిచ్చిన పవన్……నాలుగేళ్ళుగా బాబు, మోడీలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను వంచించిన వైనానికి కూడా బాధ్యుడే. కాకపోతే తన సినిమాలకు రాయితీలు, తాను ‘అభిమానించే’ హీరోయిన్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ పదవులు ఇప్పించుకోవడాలు….ఇంకా బోలెడన్ని తెరవెనుక వ్యవహారాల్లో మాత్రం పవన్ బాగానే లాభపడ్డాడు.

ఈ నాలుగేళ్ళ కాలంలో గట్టిగా ఓ పదిరోజులు మాత్రం ప్రజల కోసం పనిచేశాడు పవన్. అలాంటి పవన్ కళ్యాణ్……తనను తాను నేను కెసీఆర్‌లాంటి వాడినే అని పోల్చుకోవడం మాత్రం కమెడియన్ లాంటి నాయకుడు హీరోలాంటి నాయకుడుతో పోల్చుకున్నట్టుగానే ఉంది. అప్పుడు సోనియా…….ఇప్పుడు మోడీతో సహా గద్దెపైన ఎవరు ఉన్నా ధైర్యంగా విమర్శల వర్షంతో విరుచుకుపడే ధైర్యం ఉన్న కెసీఆర్‌కి ………….కనీసం చంద్రబాబు, కెసీఆర్‌ల తప్పులను కూడా ఎత్తి చూపే ధైర్యం లేక ఇద్దరూ చంద్రులు బ్రహ్మాండంగా పాలిస్తున్నారని చిడతలు వాయించుకుంటూ ఉన్న పవన్ ఎక్కడ?

ఇంకొక్క ఏడాదే పవన్…….ఇలాంటి కామెడీ మాటలు మాట్లాడడం ఆపేసి…….అధ్యయనం అనో, ఇంకోటనో ఫాం హౌసుల్లో, స్టార్ హోటల్స్‌లో మీటింగ్స్‌తో కాలం గడిపెయ్……..ఆ తర్వాత 2019ఎన్నికల్లో మళ్ళీ బాబుకు భజన బ్యాచ్‌గా రా………ఎలాగూ పోరాట యోధుడు, సూరుడు, వీరుడు పవనుడు వచ్చాడు అని జాకీలు పెట్టి లేపడానికి భజన మీడియా ఉందిగా. జనాలు ఛాన్స్ ఇస్తే మరో ఐదేళ్ళూ కూడా పండగే. ఇన్ని తప్పులు చేసిన తర్వాత కూడా ప్రజలు గెలిపించారంటే మాత్రం ఆ తర్వాత ఇంకెన్ని తప్పులు చేసినా ఫరక్ లేదు అన్న భరోసా కూడా వస్తుంది కాబట్టి బాబుతో కలిసి రెచ్చిపోవడమే. అంతకుమించి ఈ పోరాటాలు, ఉద్యమాలు లాంటి డైలాగులు కొట్టకు…..కెసీఆర్‌లాంటి వాళ్ళతో పోల్చుకునే ప్రయత్నం చేసి కామెడీ చెయ్యకు. ఉన్న పరువును కూడా పోగొట్టుకొకు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -