Thursday, May 9, 2024
- Advertisement -

నాలుగు రోజుల‌పాటు పోలీస్టేష‌న్‌లో గ‌డిపిన హీరో

- Advertisement -

సినిమా హీరోలు త‌మ సినిమాల్లో న‌టించేట‌ప్పుడు క్యారక్టర్‌లో వి లీనమవటం కోసం హీరోలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూంటారు. ఆ మధ్యన ధోని సినిమా కోసం సుశాంత్ క్రికెట్ నేర్చుకున్నాడు. చెలియా సినిమా కోసం కార్తి పైలెట్ ఎలా వుంటారు, ఎలా బిహేవ్ చేస్తారు దగ్గరుండి పరిశీలించాడు. ఇప్పుడు హీరో సందీప్ కిషన్ కూడా ఏకంగా నాలుగు రోజులు జైల్లో వున్నాడట.

జైల్లో ఉన్న విష‌యాన్ని హీరోనె స్వ‌యంగా చెప్పాడంట‌.అయితే అంతలా ఆయన పోలీస్ స్టేషన్ లో ఉండిపోతే మీడియా పట్టించుకోలేదా…ఏం క్రైమ్ చేసాడు…అని అడగాలనుకుంటున్నారు .అయితే ఇది చ‌ద‌వండి.

ప్రస్థానం’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ తదితర చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కథానాయకుడు సందీప్‌ కిషన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నక్షత్రం’. కృష్ణ వంశీ దర్శకుడు. ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సందీప్‌ ఎస్‌ఐ కావాలని కలలుగనే యువకుడి పాత్రలో నటించారు. పోలీసు కాలేకపోయినా.. పోలీసు దుస్తుల్ని ధరించి అనధికారికంగా విధులను నిర్వర్తిస్తారు. కాగా ఈ పాత్ర కోసం సందీప్‌ నాలుగు రోజులు పోలీసు స్టేషన్‌లో ఉన్నారట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రముఖ దర్శకుడు, నాకిష్టమైన వ్యక్తి కృష్ణ వంశీతో కలిసి పనిచేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. పోలీసుల హావభావాలు తెలుసుకోవడానికి మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌లో నాలుగు రోజులు ఉన్నాను. పోలీసులు ప్రజలతో ఎలా మాట్లాడేవారో గమనించేవాడిని. అదండి మ‌న హీరో సందీప్ జైలుజీవితం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -