Friday, May 17, 2024
- Advertisement -

దేశ ప్ర‌జ‌ల మీద మ‌రో బాంబు పేల్చిన ప్ర‌ధాని మోదీ..

- Advertisement -

సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుని దేశప్రజల నడ్డివిరిస్తున్న మోడీ సర్కారు..ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న నిర్న‌యం తీసుకుంది. నోట్ల రద్దు పేరుతో ఆర్నెల్ల పాటు ప్రజలను అష్టకష్టాలకు గురిచేసింది. ఇది ప్ర‌జ‌ల మీద పెనుభారం కానుంది.

మీకు నాలుగు గదుల ఇల్లుందా? లేదా కారుందా? లేదా ఇంట్లో ఏసీ, ఫ్రిజ్ ఉన్నాయా? ద్విచక్రవాహనం, వాషింగ్ మెషీన్ వంటి వాటిని వాడుతున్నారా? అయితే, కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలను అందుకో లేరు. సాంఘిక ఆర్థిక సర్వేలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పైన పేర్కొన్న వస్తువులు ఉంటే సంక్షేమ పథకాలను అందుకోలేరని కేంద్రం నియమించిన దేబ్రాయ్ కమిటీ బాంబులాంటి వార్తను పేల్చింది.

ఇల్లు లేని వారు, పాలిథీన్ కవర్ల గుడిసెల్లో నివాసముండేవారు, ఎలాంటి ఆదాయం లేని, మగవారు లేని ఇళ్ల వారికి, పిల్లలు సంక్షేమ పథకాలు పొందవచ్చని కమిటీ చెప్పింది. మొత్తంమీద పట్టణాల్లో నివాసముంటున్న వారిలో 59 శాతం మంది సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులని స్పష్టం చేసింది. ప్ర‌జ‌ల‌నుంచి ఎలాంటి స్పంద‌వ వ‌స్తుందొ చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -