Sunday, April 28, 2024
- Advertisement -

ఇజ్రాయిల్‌ నుంచి తెప్పించిన ప్ర‌త్యేక జాగిలాలు…..

- Advertisement -

 

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌పంచంలో ఇండియాకు ఐకాన్‌.మోదీకి ఎంత పాపులారిటి ఉందో ..అంతే రీతిలో ఉగ్ర‌వాదుల‌నుంచి అంతే ముప్పుఉంది.టెర్ర‌లిస్ట్‌ల హిట్ లిస్ట్ ల‌లో ఒక‌రు.అందుకే ఆయ‌న బ‌ధ్ర‌త‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటోంది.అందుకోస‌మే ఇజ్రాయిల్ నుంచి ప్ర‌త్యేక జాగిలాల‌ను తెప్పించారు.

స్నిఫర్ డాగ్స్ గురించి వినే ఉంటారు.. ఎక్కడైనా బాంబులు ఉన్నాయనే సమాచారం రాగానే.. పోలీసులు వాటని వెంట పెట్టుకొని బాంబులు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టేస్తారు. నేరస్థులను పట్టుకోవడంలోనూ…అవసరమయినపుడు వుసి కొల్పితే అవతలి వ్యక్తి మీద దాడి చేసి చీల్చి చెండాడతాయి.ఈ రకానివే స్నిఫ్ అండ్ అటాక్ డాగ్స్.ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉన్న వారి బ‌ధ్ర‌త‌కు ఉప‌యేగిస్తారు.ఇప్పడు అలాంటి జాగిలాలనే భారత ప్రభుత్వం ఇస్రాయిల్ నుంచి తెప్పించింది.అందుకే వీటిని ప్రధాని నరేంద్రమోదీ భద్రత దృష్ట్యా తెప్పించారు

గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 30 అటాక్ డాగ్స్, బాంబు స్నిఫర్ డాగ్స్, చేజర్స్ లను జెరుసలామ్ నుంచి తెప్పించినట్లు సీనియర్ సెక్యురిటీ అధికారి ఒకరు తెలిపారు. కాగా.. ఇప్పుడు కొత్తగా మరికొన్ని డాగ్స్ ని తెప్పించినట్లు ఆయన చెప్పారు. ఈ సారి తెప్పించిన డాగ్స్.. పేలుడు పదార్ధాలను గుర్తించడంలో ప్రపంచంలోనే ది బెస్ట్ అని వారు చెప్పారు. ఈ కానైన్లు – లాబ్రడార్లు, జర్మన్ షెప్పర్లు, బెల్జియన్ మాలిటియోస్ జాతులకు చెందిన ఈ కుక్కలు ప్రమాదాలను త్వరగా పసిగొడతాయని ఆయన తెలిపారు.

ఇవన్నీ ఇస్రాయిల్ రక్షణ రంగానికి చెందినవేనని అధికారి పేర్కొన్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్రమోదీ కి ముప్పు ఎక్కువగా ఉంది కాబట్టి.. ఈ మాత్రం భద్రత చాలా అవసరమని చెప్పారు.వీటి ధర మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారు.ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి భద్రత కల్పించాలంటే ఈ మాత్రం ఉండాల్సిందేలే.. ప్రధానితోపాటు ఈ జాగిలాల భద్రత సౌకర్యం సోనియాగాంధీ కుటుంబసభ్యలు కూడా వర్తిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -