Sunday, April 28, 2024
- Advertisement -

ముందే హెచ్చరించిన ఆద్య న్యూస్, అయినా అడ్దంగా బుక్కయిన రాజయ్య

- Advertisement -

మీ ఫోన్ కాల్ రికార్డ్ అవుతోంది జాగ్రత్త..
తెలంగాణలో నాయకులున్నారు కానీ నమ్మకమే లేదు… అనే హెడ్డింగ్ తో రెండు రోజల క్రితమే. అంటే సెప్టెంబర్ 10 వ తేదీనే ఆద్య న్యూస్ తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నేతలను హెచ్చరించింది. ఎన్నికల వేళ ప్రతి నాయకుడూఎంత జాగ్రత్తగా ఉండాలో పూసగుచ్చినట్లు వివరించింది. మీ వాళ్లు ఎవరో ? పగవాళ్లు ఎవరో ? తెలియదు కనుక ఫోన్లలో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ సుతిమెత్తగా ఆద్య న్యూస్ హెచ్చరించింది. గతంలో పలువురు నాయకులు ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఉదహరిస్తూ మరీ చెప్పింది.

‘మీ పోన్ కాల్ రికార్డ్ అవుతోంది జాగ్రత్త… తెలంగాణలో నాయకలున్నారు కానీ నమ్మకమే లేదు’ వార్తతో పాటు, ‘తెలంగాణ టీడీపీలో కేసీఆర్ కోవర్టులు ‘ జాగ్రత్త పడకపోతే ఓటుకు కోట్లు సీన్ రిపీట్’ శీర్షికతో ఈ నెల 8వ తేదీన మరో ఆర్టికల్ కూడా ఆద్య న్యూస్ ఇవ్వడం జరిగింది.

రెండు ప్రధానమైన, అత్యంత కీలకమైన ఆర్టికల్స్ తో ఆద్య న్యూస్, ఆద్య మీడియా ముందే హెచ్చరించినా, తెలంగాణలో పలువురు నాయకులు కళ్లు తెరవడం లేదు. ఫోన్ల ట్యాపింగ్, సహా వాయస్ కాల్స్ రికార్డ్ చేసే ప్రమాదముంది. మీ కొంప కొళ్లేరయిపోతుంది. అని పదే పదే హెచ్చరించడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థులు, వారి ప్రత్యర్థుల నుంచి సవాలక్ష సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అనేక మంతనాలు, వ్యూహాలు, చర్చలు, ప్రలోభాలు, బెదిరింపులు, హెచ్చరికలు, పర్సనల్ అఫైర్స్, బేరసారాలు, ఇతర బిస్కెట్లు. వేస్తారు. అనేక రకాలుగా వల విసురుతారు. మీ వాళ్లతోనే మీకు గొయ్యి తవ్వించే ప్రమాదముంటుంది. జాగ్రత్త అని ఆద్యన్యూస్ చాలా లోతుగా అధ్యయనం చేసి, ఎలాంటి సందర్భాల్లో ఎలా ఇరుక్కుంటారో ? మిమ్మల్ని ఇరికించడానికి ఎలా స్కెచ్ గీస్తారో..? చాలా లోతుగా అధ్యయనం చేసి మరీ, పై రెండు ఆర్టికల్స్ లో ఆద్య న్యూస్ హెచ్చరించింది.

అయినా కొందరు తలకెక్కించుకోలేదు. ఇప్పుడు మాజీ మంత్రి రాజయ్య ఓ మహిళతో ఫోన్ సంభాషణ టేపులు బయటపడ్డాయి. వాటిపై మీడియా మొత్తం రచ్చ రచ్చ చేసేస్తోంది. రాజయ్యకు వచ్చే ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టేందుకు ఈ ఆడియో టేపులను ప్రత్యర్ధులు వాడుకుంటున్నారు. ఇక ఇందులో నిజమెంత ? అబద్ధమెంత ? అనేది తర్వాత తేలినా, ఇప్పటికైతే రాజయ్యకు నష్టం జరిగిపోయింది. ఇంకా ఇలా ఎవరూ ఇరుక్కోకూడదంటే…ఓ సారి ఆద్య న్యూస్ లోని పై రెండు ఆర్టికల్స్ చదవండి. మీ నాయకులకు, కార్యకర్తలకు ఆద్య మీడియా వీడియోలను షేర్ చేయండి. ఎలక్షన్ టైంలో ఇలాంటి హెచ్చరికలు, మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీల కోసం ఆద్యన్యూస్ వైబ్ సైట్, ఆద్య మీడియా యూ ట్యూబ్ చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -