- Advertisement -

హోస్‌మెట్స్‌ ఎమోష‌న్స్‌తో ఆడుకున్న బిగ్‌బాస్‌

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.90 రోజుల‌కు పైబ‌డి జ‌రుగుతున్న ఈ షోలో చివ‌రికి ఏడుగురు స‌భ్యులు మిగిలారు.మంగ‌ళ‌వారం షో మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది.మంగ‌ళ‌వా రం జ‌రిగిన ఎపిసోడ్‌లో హౌస్‌మెట్స్‌ని కంట్రోల్ చేసే రిమోట్ తన చేతుల్లోకి తీసుకొని ‘ఫ్రీజ్..’ అంటూ వారితో ఓ గేమ్ ఆడుకున్నాడు బిగ్‌బాస్.ఓ జోక‌ర్‌ని హౌస్‌లోకి పంపించి వారితో స‌రాదా ఆట ఆడించాడు బిగ్‌బాస్‌.త‌రువాత హౌస్‌మెట్స్‌ని ఫ్రీజ్ చేసి వారి ఇంటి స‌భ్యుల‌ని ఒక్కొక్కరిని హౌస్‌లోకి పంపిచారు బిగ్‌బాస్‌.సామ్రాట్ కోసం తన తల్లి వచ్చింది.

ఫ్రీజ్ అయి ఉన్న తన కొడుకుని వెనుక నుండి కౌగిలించుకొని సంతోష పడింది.ఇక అమిత్ కోసం తన కొడుకు వస్తూ.. ‘హాయ్ పాపా ఐ మిస్ యూ సో మచ్’ అని చెప్పడం ఎమోషనల్ గా సాగింది. తన కొడుకుని హత్తుకొని ఏడుస్తున్న అమిత్ ని చూస్తుంటే తనకు పిల్లలతో ఉన్న బాండింగ్ తెలుస్తుంది. దీప్తి కోసం ఆమె భ‌ర్త వ‌చ్చారు.దాదాపు 95 రోజుల త‌రువాత వారి ఇంటి స‌భ్యుల‌ను చేడగానే వారు కాస్తా భావోద్వేగానికి లోనైయ్యారు.ఇక రోజు జ‌ర‌గ‌నున్న ఎపిసోడ్‌లో గీతా మాధురి,కౌశ‌ల్‌,త‌నీష్‌,రోల్ రైడా ఇంటి స‌భ్యులు హౌస్‌లో సంద‌డి చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -