Wednesday, May 15, 2024
- Advertisement -

బాహుబలి ప్రభావం: బుజ్జిగాడు అక్కడ పెద్ద హిట్..!

- Advertisement -

బాహుబలి పార్ట్ వన్ ప్రభాస్ కు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.

తెలుగులో సంచలన విజయం సాధించిన ఆ సినిమా పక్కనే ఉన్న తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో కూడా అదే స్థాయి విజయాన్ని.. బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ ను సాధించింది. మరి ఆ సినిమా హిట్ అయ్యే సరికి ప్రభాస్ పాత సినిమాలకు కూడా కొత్త క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించగా తెలుగులో విడుదల అయిన సినిమాలు అనేకం వివిధ భాషల్లోకి డబ్ అవుతున్నాయి. అలాంటి పరంపరలో ‘బుజ్జిగాడు’ సినిమా మలయాంలోకి డబ్ అయ్యింది. “రుద్రన్” పేరుతో ఈ సినిమా డబ్ అయ్యింది.

మరి ఏదో ఉత్తుత్తి డబ్బింగ్ సినిమాగా మిగిలిపోవడం కాదు.. మలయాళ గడ్డపై ప్రభాస్ సినిమా మంచి ఓపెనింగ్స్ న సంపాదించుకొంది. తొలి వారంలోనే దాదాపు పదిహేను లక్షల రూపాయలను వసూలు చేసిందట ‘రుద్రన్’. మరి ఒక డబ్బింగ్ సినిమాకు ఆ మాత్రం వసూళ్లు ఊరటను ఇచ్చేవే. ఇంకా ఆ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మకం కూడా ఉంటుంది. దీంతో ఈ సినిమాను మలయాళంలోకి డబ్బింగ్ చేసిన వారు లాభపడినట్టే! ఈ విధంగా బాహుబలి క్రేజ్ తోమలయాళంలో విడుదల అయిన సినిమా లాభాలను కళ్ల జూస్తోంది.

మరి ఇంకా ప్రభాస్ నటించిన మరికొన్ని సినిమాలుకూడా ఇప్పుడు మలయాళంలోకి డబ్ అవుతున్నాయి. మిర్చి సినిమాను త్వరలోనే అక్కడ విడుదల చేయనున్నారు. మరి మిర్చి తెలుగులోనే సూపర్ హిట్ అయ్యింది.. మలయాళంలో ఇంకెంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -