Tuesday, May 14, 2024
- Advertisement -

అజ్ఞాతవాసి’పై ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సాలీ సంచలన కామెంట్….

- Advertisement -

కత్తి మహేష్ ఆరోపణలు నిజమయ్యాయి. అజ్ణాత వాసి ఫ్రెంచ్ సిన‌మా లార్గో వించ్ సినిమాను కాపీ కొట్టార‌ని మొద‌ట్లోనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే వాఖ్య‌ల‌ను అంద‌రూ కొట్టివేశారు. అప్ప‌ట్లోనే ఫ్రెంచ్ చిత్రం ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సాలీ స్పందించారు. సినిమాను చూస్తాన‌ని త‌ర్వాత స్పందిస్తాన‌ని వెల్లిడించారు.

త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ తాజా సినిమా ‘అజ్ఞాతవాసి’ తన సినిమాకు కాపీయేనని ఫ్రెంచ్ చిత్రం ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సాలీ వ్యాఖ్యానించారు. గత రాత్రి లీ బ్రాడీలోని మెట్రో 4 థియేటర్ లో రాత్రి 7.45 గంటల షోను చూసిన ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తాను సినిమాను చూశానని, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఈ సినిమా తనకు కూడా నచ్చిందని, అయితే, దురదృష్టవశాత్తూ కథ, తన చిత్ర కథకు చాలా దగ్గరగా ఉందని చెప్పారు.

ఈ చిత్రం ‘లార్గో వించ్’ చిత్రానికి కాపీ అని గతంలోనే కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కథపై తమకు స్పష్టత ఇవ్వాలని ‘లార్గో వించ్’ భారత హక్కులను సొంతం చేసుకున్న టీ-సిరీస్ నుంచి ‘అజ్ఞాతవాసి’ నిర్మాతలకు నోటీసులు అందిన సంగతి తెలిసిందే. ఇక జెరోమ్ సాలీ ట్వీట్ ను చూసిన వారు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మ‌రి చూడాలి ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ జెరోమ్ సాలీ వ్యాఖ్య‌ల‌పై ఎలా స్పందిస్తారో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -