Sunday, May 5, 2024
- Advertisement -

అజ్ఙాతవాసి సినిమా ఎలా ఉందంటే…….? పవన్, త్రివిక్రమ్‌లు అనుకున్నట్టే….

- Advertisement -

125 కోట్ల రూపాయల బిజినెస్…….అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబినేషన్‌లో వస్తున్న సినిమా……అజ్ఙాతవాసి రిజల్ట్ ఎలా ఉంది? పవన్, త్రివిక్రమ్‌లు మరోసారి మేజిక్ చేశారా? నాన్ బాహుబలి రికార్డ్ అజ్ఙాతవాసి సొంతమవుతుందా? కథేంటి? పవన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏ స్థాయిలో సక్సెస్‌ని ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు?

అందరూ ఊహించినట్టుగానే …..సినిమా రిలీజ్‌ని ఆపేస్తామన్న టి సిరీస్‌తో పది కోట్లకు బేరం చేసి సెటిల్ చేసుకున్న కథే. ఇంతకుముందు సినిమాలు కూడా అక్కడక్కడా కాపీలే అయినప్పటికీ ఈ సినిమాకు మాత్రం టి సిరీస్ రైట్స్ కొని ఉండడంతో ప్రొడ్యూసర్స్‌కి పదికోట్లకు రిలీజ్‌కి ముందే నష్టం చేశాడు త్రివిక్రమ్. పైగా త్రివిక్రమ్, పవన్‌లకు ఈ సినిమా ఫైనల్ కాపీ చూసినప్పుడే సినిమాపై నమ్మకం పోయింది. దాంతో మొదటి మూడు వారం రోజుల్లోనే ఫ్యాన్స్ క్రేజ్‌ని పూర్తిగా క్యాష్ చేసుకోవాలనుకున్నారు. ముందు నుంచీ భజన చేస్తున్న చంద్రబాబుతో పాటు, కొత్త సంవత్సరంలో కొత్తగా కెసీఆర్ భజన కూడా స్టార్ట్ చేసి టికెట్ రేట్లు, షోల సంఖ్యను పెంచుకోవడానికి పర్మిషన్స్ తెచ్చుకున్నారు. త్రివిక్రమ్, పవన్‌లు ఇద్దరూ అనుకున్నట్టుగానే ఆ పొలిటికల్ ఆమ్యామ్యాల కార్యక్రమమే ఈ సినిమా కలెక్షన్స్‌కి ప్రాణం అయిపోయింది.

ఎందుకంటే సినిమాలో ఏమీ లేదు మరి. ఒక కోటీశ్వరుడైన తండ్రికి వారసుడైన అభి…..అతని వారసత్వాన్ని ఎలా సాధించుకున్నాడు, అతని కంపెనీలను ఎలా నిలబెట్డాడు అనేది కథ. అయితే ఈసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సామర్థ్యం మరీ దిగువస్థాయికి పడిపోయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సెకండ్ హాఫ్‌లో…….అది కూడా కొడకా కోటేశ్వరరావా పాట సమయంలో మాత్రం ఒక పదినిమిషాలు గొప్పగా నవ్వించాడు. ఆ ఎపిసోడ్ పక్కనపెడితే ఇక సినిమాలో ఎక్కడా కూడా మెరుపులు ఉండవు. అన్నింటికీ మించి బోలెడన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన త్రివిక్రమ్………ఆ పాత్రల మధ్య సమన్వయం చేయడాన్ని పూర్తిగా మర్చిపోయాడు. తానే కన్ఫ్యూజ్ అయిపోయాడు. కనీసం హీరోయిన్స్ క్యారెక్టర్‌కి న్యాయం చేయలేకపోయాడు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ పాటలు ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సోసో అన్నట్టే ఉంది. కెమేరా వర్క్ చాలా బాగుంది. నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు.

ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు అని త్రివిక్రమ్ చెప్పాడు కానీ అందులో పదిశాతం కూడా పవన్ పెర్ఫార్మెన్స్ లేదు అన్నది నిజం. అజ్ఙాతవాసిలో పవన్ చూపించింది విశ్వరూపం అయితే సుస్వాగతం, తొలిప్రేమ, ఖుషీలాంటి సినిమాలకు పూర్తిగా అన్యాయం చేసినట్టే. గోపాల..గోపాల సినిమాలో కూడా పవన్ యాక్టింగ్ బాగుంటుంది.

మొత్తంగా చూసి అజ్ఙాతవాసి సినిమా కంటెంట్ పరంగా నిరాశపరిచింది. పొలిటికల్ ప్యాకేజీల పుణ్యమాని తెచ్చుకున్న ఎగస్ట్రా షోల పర్మిషన్స్, టికెట్ రేట్ల పెంపులాంటి వ్యవహారాలే ఇక అజ్ఙాతవాసిని కాపాడాలి. పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంత ఎక్కువ రేట్లకు టిక్కెట్స్ కొని…….ఎన్ని ఎక్కువ షోలు చూస్తే అజ్ఙాతవాసికి కనీసం గౌరవప్రదమైన కలెక్షన్స్ వస్తాయి. అభిమానులందరూ ఎగబడి చూడడానికి అవసరమైన ఏర్పాట్లయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ భజన ప్రోగ్రాములు సెట్ చేసిపెట్టాయి. మరిక సినిమా బాగాలేకపోయినా ఆ స్థాయిలో చాలా ఎక్కువ సార్లు భారీ రేట్లకు సినిమాను చూసి అజ్ఙాతవాసి కలెక్షన్స్ పెంచుతారా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -