Saturday, May 18, 2024
- Advertisement -

చేతకాని వాళ్ళం, కరివేపాకులం అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా జేసీ దివాకర్‌రెడ్డి?

- Advertisement -

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకుంటూ ఉంటాడు. ఇక ఆ పార్టీలో ఉన్న మరొక అత్యంత అనుభవజ్ఙుడు జేసీ దివాకరరెడ్డి. పరిటాల రవి హత్యకు ప్రధాన కారకుడు అని చెప్పి ఇదే జేసీని రాక్షసుడిగా చిత్రీకరిస్తూ దేశవ్యాప్తంగా హంగామా చేశారు చంద్రబాబు అండ్ కో. కానీ అధికారంలోకి రావాలంటే జేసీ అవసరం అని చంద్రబాబుకు అనిపించేసరికి జేసీలు ఫ్యాక్షనిస్టులు, రాక్షసులు, పరిటాల రవిని చంపిన హంతకులు అని చంద్రబాబు, పరిటాల సునీత, పచ్చ మీడియా చెప్పిన విషయాలన్నింటినీ మరిచిపోయారు. మరీ ముఖ్యంగా పరిటాల సునీత కూడా రాజకీయం కోసం జేసీలతో కలిసిపోవడం రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్ఛర్యపరిచింది. చంద్రనీతి అలానే ఉంటుందేమో తెలియదు మరి.

రాజకీయాల విషయం పక్కనపెడితే 2014ఎన్నికల సమయంలో మేం అత్యంత అనుభవజ్ఙులం, తోపులం, తురుంఖాన్‌లం అని చెప్పుకున్నారు చంద్రబాబుతో సహా టీడీపి నేతలందరూ కూడా. జేసీ దివాకరరెడ్డి కూడా జగన్‌ని పిల్లనేతగా తీసేస్తూ బోలెడన్ని ప్రగల్భాలు పలికాడు. జనాలు కూడా అనుభవజ్ఙులు ఏదో చేస్తారన్న ఆశతో అధికారం అప్పగించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ చంద్రబాబు, జేసీలు పూర్తిగా రివర్స్‌లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తుండడం మాత్రం ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోంది. అనుభవజ్ఙులం, తోపులం అని చెప్పి గద్దెనెక్కి……అందలమెక్కాక మాత్రం మేం కూరలో కరివేపాకులం, చేతకానివాళ్ళం అని చెప్పి సానుభూతి పొందే ప్రయత్నం చేయడం మాత్రం విమర్శలకు గురవుతోంది. ప్రత్యేక హోదాతో సహా అన్ని విషయాల్లోనూ టిడిపి రాజకీయాలు ఇలానే ఉంటున్నాయి.

తాజాగా రైల్వే జోన్ విషయంలో కూడా ఇలానే మాట్లాడేశారు టిడిపి ఎంపిలు. మేం కూరలో కరివేపాకులం, చేతకాని వాళ్ళం అన్నట్టుగా మాట్లాడి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం పోరాటం చెయ్యొచ్చు కదా అని అడిగితే కూడా……పోరాటమా…వంకాయ….మాకు అంత సీన్‌లేదు అని గడుసుగా సమాధానం చెప్తున్నారు. మరి అంత చేతకాని వాళ్ళు అయితే ఎన్నికల నాడు జగన్ కంటే అనుభవజ్ఙులం, అన్నీ చేస్తాం అని ప్రగల్భాలు పలకడం ఎందుకు? కేవలం ఓట్లు కొల్లగొట్టి అధికారం పొందడం కోసమేనా? అధికారం దక్కాక ప్రజల అవసరాలు, రాష్ట్ర అవసరాల గురించి అడిగితే మాత్రం….మేకం కూరలో కరివేపాకులం, చేతకాని వాళ్ళం అని చెప్పి తప్పించుకుంటారా? అంటే వ్యక్తిగత స్వార్థాల కోసం, అధికారం కోసం రాజకీయం చేస్తూ ఉన్నారా? అయినా చేతకానివాళ్ళం, కూరలో కరివేపాకులం అని నిస్సిగ్గుగా చెప్పుకోవడానికి అయినా సిగ్గుపడాలనిపించడం లేదా సార్లూ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -