ఉత్తరప్రదేశ్‌లో భాజాపా ప్రభుత్వం నేరస్తులపై ఉక్కుపాదం మోపింది. ముఖ్యమంత్రిగా యోగీ బాధ్యతలు తీసుకున్న తర్వాత 16 నెలల వ్యవధిలోనే 3026 ఎన్‌కౌంటర్లు జరిగాయి. దీనికి సంబంధించిన రిపోర్ట్ బయటకు వచ్చింది. అందులో 78 మంది నేరస్తులు చనిపోయారు. 838 మంది గాయపడ్డాడు. 7043 మంది క్రిమినల్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరచరిత్ర ఉన్న 11,981 మంది బెయిల్ రద్దు చేసి వారిని కోర్టుల్లో హాజరుపరిచారు.
16 నెలల కాలంలో ఈ గణాంకాలు నమోదైనట్లు డీజీపీ కార్యాలయ అధికారి ఒకరు వెల్లడించారు.ఇక స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లలో మరో 9 మంది చనిపోయారు. 139 మంది అరెస్ట్ అయ్యారు. అంటే ప్రతి నెలా సగటున నలుగురు క్రిమినల్స్‌ను హతమార్చినట్లు ప్రభుత్వం చెప్పింది. ప్రతి రోజూ సగటున ఆరు ఎన్‌కౌంటర్లు జరిగినట్లు తెలుస్తోంది.
