Monday, May 6, 2024
- Advertisement -

కోహ్లీస్థానంలో రాహుల్…?

- Advertisement -

టీవీ షోలో మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు యువ క్రికెటర్లు కేఎల్‌ రాహుల్, హార్దిక్‌ పాండ్యాలపై విధించిన నిరవధిక నిషేధాన్ని తొల‌గించింది ఏవోఏ. దీంతో హార్దిక్‌తో పాటు కేఎల్ రాహుల్ కూడా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు మార్గం సుగుమమైంది.

న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌నున్న మూడు టీ20ల‌కు రాహుల్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్‌ని సెలక్టర్లు ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వ‌రల్డ్ క‌ప్‌ను దృష్టిలో పెట్టుకొని మూడు నెల‌లుగా విరామం లేకుండా ఆడుతున్న విరాట్‌కు విశ్రాంతి నిచ్చింది మేనేజ్‌మెంట్‌.

వాస్తవానికి పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న కేఎల్ రాహుల్‌ని న్యూజిలాండ్ పర్యటన కోసం తొలుత సెలక్టర్లు ఎంపిక చేయలేదు. రాహుల్‌ భారత ‘ఎ’జట్టు తరఫున బరిలోకి దిగుతాడని బీసీసీఐ ప్రకటించింది. అయితే కివీస్‌తో తొలి వన్డే ముగిసిన తర్వాత కోహ్లీకి విశ్రాంతినివ్వాలని ఆకస్మికంగా నిర్ణయించడంతో.. అతని స్థానంలో రాహుల్‌కి అవకాశమివ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నారు.

గత కొంతకాలంగా టెస్టుల్లో ఓపెనర్‌గా.. వన్డే, టీ20ల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్.. ఇటీవల వివాదం, సస్పెన్షన్ నేపథ్యంలో.. మళ్లీ ఫామ్‌ని నిరూపించుకోవాల్సి అవసరం ఏర్పడింది. హార్దిక్ పాండ్య త్వరలోనే భారత్ జట్టుతో చేరి.. వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -