- Advertisement -
భారతదేశంలో అన్నింటి కంటే న్యాయానికి, న్యాయస్ధానానికే ఎక్కువ విలువ ఉందని, వాటి ముందు ఎంతటి వారైనా చిన్నవారేనని ఉత్తరాఖండ్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇందుకు రాష్ట్రపతి కూడా మినహాయింపు కాదు. ఒక్కోసారి రాష్ట్రపతి కూడా తప్పులు చేయవచ్చు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ వేసిన పిటీషన్ పై హైకోర్టు న్యాయమూర్తులు కె ఎం జోసఫ్, బిస్తే విచారించింది.
సమీక్షకు లోని కానిది ఏదీ ఉండదు. దీనికి రాష్ట్రపతి కూడా మినహాయింపు కాదు అని ఆ ధర్మాసనం అభిప్రాయపడింది.