Sunday, May 5, 2024
- Advertisement -

నాలుగువైపుల నుండి ఆర్ధిక సమస్యలు కమ్ముకుంటున్నాయి…బాబు ప‌రిస్థితేంటి…?

- Advertisement -

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత లోటు బడ్జెట్ తో ప్రారంభమైన ప్రభుత్వం చంద్రబాబు డాబు, దర్పాల కారణంగా మరింత ఊబిలోకి కూరుకుపోయింది ఏపీ. ఒక వైపు అభివృద్దికి కేంద్రం నిధులు ఇస్తున్నా అవ‌న్నీకూడా స‌రిపోవ‌డంలేదు.మ‌రో వైపు అప్పులు భారీగా చేస్తోంది.కాని ఇదే ఇప్పుడు బాబు ప్ర‌భుత్వం మెడ‌కు చుట్టుకుంటోంది.

రెవిన్యూలోటుతో ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలంటె దుబారా ఖ‌ర్చులును త‌గ్గించుకోవాలి.కాని బాబు దుబారా ఖ‌ర్చుల వ‌ల్ల చివరకు అప్పులతోనే మనుగడ సాగించాల్సిన పరిస్ధితిలోకి దిగజారిపోయింది. ఫలితంగా రాష్ట్రం అప్పు సుమారు రూ. 2 లక్షల కోట్లు దాటిపోయింది. అంటే కేంద్రం విధించిన ఎఫ్ఆర్బిఎం పరిధిని కూడా దాటిపోయింది. రాష్ట్ర స్ధూలఆదాయంలో 25 శాతం దాటకూడదు అప్పులు.కాని అది 27 శాతం దాటిపోయింది.

మారిన రాజకీయ పరిస్ధితిల్లో కేంద్రం రాష్ట్రప్రభుత్వాన్ని బాగా బిగించేస్తోంది. ఆర్ధికం అవసరాలు తీర్చుకోవటానికి చంద్రాబాబునాయుడు ప్రభుత్వం చేస్తున్న ప్రతీ విజ్ఞప్తినీ కేంద్రం పక్కన పెట్టేస్తోంది. మరీ ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. దాంతో చుట్టుముడుతున్న ఆర్ధిక కష్టాల నుండి ఎలా బయటపడాలో ప్రభుత్వానికి అర్ధం కావటం లేదు. ఒకవైపు పెరిగిపోతున్న అప్పులు, ఇంకోవైపు తగ్గిపోతున్న ఆదాయాలు, మరోవైపు అదుపు తప్పిన ఖర్చులు చివరగా కేంద్ర సహాయనిరాకరణ..ఇలా నాలుగువైపుల నుండి ఆర్ధిక సమస్యలు కమ్ముకుంటున్నాయి.
.
పోనీ విదేశీసంస్దల నుండి తీసుకునే అప్పులను రాష్ట్రం ఖాతాలో చూపవద్దని చేసిన విజ్ఞప్తికీ కేంద్రం అంగీకరించలేదు. దీనివల్ల రాజధాని నిర్మాణం, పోలవరం లాంటి ప్రాజెక్టులకు డబ్బులు సర్దుబాటు సాధ్యం కాదు. అస‌లే లోటుబ‌డ్జెట్‌లో ఉన్న ప్ర‌భుత్వం అప్పులు చేయ‌క‌పోతె అభివృద్ది సాధ్యం కాదు.దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.గ‌తంలో క‌నీసం కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు స‌పోర్ట్‌గా ఉండేవాడు..కాని ఇప్పుడు అదికూడాలేదు.మ‌రి బాబు ఎలాంటి నిర్న‌యాలు తీసుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -